-
-
Home » Telangana » Mahbubnagar » If you raise your hand we will stop the bus-MRGS-Telangana
-
చెయ్యి ఎత్తితే బస్సు ఆపుతాం
ABN , First Publish Date - 2022-09-12T05:15:46+05:30 IST
ప్రయాణికులు చెయ్యి ఎత్తితే బస్సులు ఆపడమే కాకుండా సామానుతో వచ్చే ప్రయాణికులను బస్సులో ఎక్కేందుకు అవకాశం కల్పించాలని బోయపల్లి గ్రామస్థులు మహబూబ్‌నగర్ డీఎం మధుసూదన్‌కు వివరించా రు.

- ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’లో డీఎం మధుసూదన్
మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 11 : ప్రయాణికులు చెయ్యి ఎత్తితే బస్సులు ఆపడమే కాకుండా సామానుతో వచ్చే ప్రయాణికులను బస్సులో ఎక్కేందుకు అవకాశం కల్పించాలని బోయపల్లి గ్రామస్థులు మహబూబ్‌నగర్ డీఎం మధుసూదన్‌కు వివరించా రు. ఆదివారం మహబూబ్‌నగర్ మునిసిపల్ పరిధిలోని 16వ వార్డు బోయపల్లిలో నిర్వ హించిన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో డీఎం ప్రయాణికుల సమస్యలను తెలుసు కున్నారు. మీరు చెప్పిన విధంగా చెయ్యి ఎత్తితే బస్సు ఆపేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే ప్రయాణికులు తీసుక వెళ్లే వస్తువులకు అనుమతి ఇవ్వడం జరుగుతుం దని, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కల్గించవద్దని తెలిపారు. బస్సులు రద్దీగా ఉన్న ప్పుడు డ్రైవర్ సామను విషయంలో కోపం చేస్తుండవచ్చునని తెలిపారు. ప్రయాణి కులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కొరియర్ సర్వీసు సంస్థ నడిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ రాంజీ, ఈడబ్ల్యూబి. సభ్యులు రాజేందర్‌గౌడ్, ప్రకాష్, 16వ వార్డ్ కౌన్సిలర్ మోతీలాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకట్రాములు, మాజీ కౌన్సిలర్ శరత్‌చంద్ర, పిట్ల ఆంజనేయులు, వాస సత్యం, బాలరాజుగౌడ్, యాదగిరి, మురుగని రాజు, పటేల్ రాఘు, గోపాల్‌యాదవ్, గ్రామస్థులు పాల్గొన్నారు.