పాలమూరు - రంగారెడ్డి పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

ABN , First Publish Date - 2022-11-27T23:06:35+05:30 IST

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి పాలమూ రు జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

పాలమూరు - రంగారెడ్డి పూర్తయితే  ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

వనపర్తి అర్బన్‌, నవంబరు 27: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి పాలమూ రు జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ, మండల పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సాగునీటి రాకతో పాలమూరు జిల్లా స్వరూపం మారిపోయిందని, వలసవెళ్లిన పల్లెలు వెనక్కి వచ్చా యి, గ్రామాల్లో పక్షుల కిలకిలరావాలు, ధాన్యం రాశు లు దర్శనమిస్తున్నాయని అన్నారు. సమైఖ్య రాష్ట్రం లో అత్యధికంగా నష్టపోయిన జిల్లా పాలమూ రు అని, కేసీఆర్‌ పట్టుదలతో ఎనిమిదేళ ్లలో సమూల మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. కోర్టు కేసుల మూలంగా పాలమూరు - రంగారెడ్డి పనులు ఆలస్య మయ్యాయని ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపుల్లలు వేసినా ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు బీళ్లను తడుపుతామని అన్నారు. దశాబ్దాల గోస తీర్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. డిసెంబరు 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌ నగర్‌ పర్యటన ఉంటుందని అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, రాజకీయ శిక్షణ తరగతుల జిల్లా కమిటీ చైర్మన్‌ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:06:36+05:30 IST