మహిషాసుర మర్ధినీ నమోస్తుతే

ABN , First Publish Date - 2022-10-01T04:44:47+05:30 IST

ఉమామహేశ్వర క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసుర మర్ధినీ నమోస్తుతే
ఉమామహేశ్వరంలో మహిషాసుర మర్ధిని అలంకరణ

అచ్చంపేట/టౌన్‌/కల్వకుర్తి, సెప్టెంబరు 30:  ఉమామహేశ్వర క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకరణలో  భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ కందూ రు సుధాకర్‌ల ఆధ్వర్యంలో అర్చకులు వీరయ్య, రాజశే ఖర్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌లు పాపనాశిని గుండంలో ని గంగా జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి పుణ్యస్నానా లు చేయించారు. ఈశ్వరునికి క్షీరాభిషేకం, పంచామృతా భిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, గణపతిఅయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చి న భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా పర్యవేక్షణ చేపడుతున్నారు.  సిబ్బంది రామకృ ష్ణ, లక్ష్మయ్య, పర్వతాలు, కవికుమార్‌  ఉన్నారు. 


వివిధ రూపాల్లో భక్తులకు అమ్మవారు దర్శనం

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అ చ్చంపేట పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం, భ్ర మరాంబికా దేవి ఆలయం, భక్తమార్కండేయ, సత్యసార ుుబాబ ఆలయంతో పాటు పట్టణంలోని వేంకటేశ్వర కా లనీలోని రెడ్డి భవనంలో, సాయినగర్‌ కాలనీలో వివిధ రూపాలలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. క న్యకాపరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బం ధం విశ్వేశ్వరనాథ్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు ని ర్వహించారు. మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. ఆలయంలో భక్తులు కుంకుమార్చనలు చేశారు. భ్రమ రాంబికా దేవాలయంతో పాటు భక్తమార్కండేయ ఆల యంలో లలితాత్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శమి చ్చారు. అదేవిధంగా  భ్రమరాంబికా దేవి ఆలయంలో చైర్మన్‌ నల్లపు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అర్చకులు కాటేపల్లి శ్రీనివాసులు, ఉదయ్‌ భాస్కర్‌, వెంకటశాస్ర్తీ అమ్మవారికి పూజలు నిర్వహించారు.  


ధనలక్ష్మీదేవి అలంకరణలో వాసవీమాత

-రూ.కోటి 10లక్షలతో అలంకరణ

కల్వకుర్తి పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దే వాలయంలో ఆలయ ఫౌండర్‌ ట్రస్టి జూలూరి రమేష్‌ బాబు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం వాసవీ మాత ధనలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమి చ్చారు. వాసవీ మాతను రూ.కోటీ 10లక్షలతో అలంకరిం చారు. అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఫౌండర్‌ ట్రస్టి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ మాతను మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తరంజన్‌దాస్‌న జూలూరి రమేష్‌బాబు పూల మాల, శాలువాతో సత్కరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య మహాసభ, వాసవి, వనిత క్లబ్‌ల సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 


Read more