రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎం మృతి

ABN , First Publish Date - 2022-12-12T23:06:25+05:30 IST

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు నాగేందర్‌(54) సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎం మృతి
నాగేందర్‌(ఫైల్‌ఫొటో)

దేవరకద్ర, డిసెంబరు 12: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు నాగేందర్‌(54) సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. దేవరకద్ర మండలం డోకూర్‌ గ్రామంలోని జడ్పీ హెచ్‌ఎస్‌లో నాగేందర్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉంటున్న భార్యా, పిల్లలను చూసేందుకు వెళ్లాడు. మలక్‌ పేట వద్ద కారు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్‌ నాగేంద ర్‌ను ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం య శోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. నాగేందర్‌ అవయవాలను దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

Updated Date - 2022-12-12T23:06:25+05:30 IST

Read more