-
-
Home » Telangana » Mahbubnagar » High people should be taken as role models-MRGS-Telangana
-
ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-09-20T04:50:57+05:30 IST
విద్యార్థులు ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి
మదనాపురం, సెప్టెంబరు 19: విద్యార్థులు ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిర్మలాయపల్లె గ్రామంలో మంత్రి 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, మండల కేంద్రంలో కేజీబీవీ కళాశాలను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థులకు జూరాల ప్రాజెక్టులను, ఏదుల రిజర్వాయర్లను చూపించాలన్నారు. మంత్రి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ప్రతీ ఒక్కరు చదువుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
చేప పిల్లలు విడుదల
మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన అయిదు లక్షల చేప పిల్లలను మంత్రి, ఎమ్మెల్యే వదిలారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాష, జడ్పీటీసీ సభ్యులు కృష్ణయ్య యాదవ్, మార్కెట్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, ఎంపీపీ పద్మావతి, బిట్లి యాదగిరి, రాంనారాయణ, పద్మమ్మ, శారద, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.