పాలమూరును బాగుచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

ABN , First Publish Date - 2022-11-27T23:25:14+05:30 IST

సొంత ఊరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఏమాత్రం కష్టపడకుండా గెలిచే అవ కాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి పాలమూరుకు వచ్చానని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

పాలమూరును బాగుచేసేందుకే  రాజకీయాల్లోకి వచ్చా
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- పాలమూరును హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతా

- ఆబ్కారి శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం నవంబరు 27 : సొంత ఊరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఏమాత్రం కష్టపడకుండా గెలిచే అవ కాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి పాలమూరుకు వచ్చానని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌లో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల 1985 -1988 పూర్వ విద్యార్థులు గెట్‌ టుగెదర్‌ నిర్వహించిన కార్యక్ర మానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు పాలమూరును ఊహించని స్థాయిలో అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమన్నారు. సీఎం కేసీఆర్‌ సహకా రంతో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేయడం తన లక్ష్యం అన్నారు. పాలమూరును హైదరాబాద్‌కు దీటుగా తీర్చి దిద్దుతామన్నారు. ఈ కారక్రమంలో మంత్రి క్లాస్‌మేట్స్‌ అయిన పశుసంవర్దక శాఖ డైరెక్టర్‌ నాగరత్నమ్మ, వనపర్తి జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్‌, నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్‌, రఘురామ్‌రెడ్డి పాల్గొన్నారు

బజరంగదళ్‌ జిల్లా అధ్యక్షుడికి పరామర్శ

మహబూబ్‌నగర్‌, నవంబరు 27 : అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటర్‌లో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్‌ బజరంగదళ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ ముదిరాజ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లిన మంత్రి శ్రీకాంత్‌ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

Updated Date - 2022-11-27T23:25:18+05:30 IST