హామీ నెరవేర్చనందునే అసమర్థ ఎమ్మెల్యే అని ఆరోపించా

ABN , First Publish Date - 2022-10-04T05:07:28+05:30 IST

నవాబ్‌ పేట మండలంలోని కొల్లూరు ను మండలంగా చేస్తానని ఇ చ్చిన హామీతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయక పోవడం, వంద పడకల ఆసుప త్రిని ప్రారంభించకపోవడం త దితర హమీలను నెరవేర్చనం దునే అసమర్థ, చేతకాని ఎమ్మెల్యేగా జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి అని ఆరోపిం చానని కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

హామీ నెరవేర్చనందునే అసమర్థ ఎమ్మెల్యే అని ఆరోపించా
మాట్లాడుతున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి 


జడ్చర్ల, అక్టోబరు 3: నవాబ్‌ పేట మండలంలోని కొల్లూరు ను మండలంగా చేస్తానని ఇ చ్చిన హామీతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయక పోవడం, వంద పడకల ఆసుప త్రిని ప్రారంభించకపోవడం త దితర హమీలను నెరవేర్చనం దునే అసమర్థ, చేతకాని ఎమ్మెల్యేగా జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి అని ఆరోపిం చానని కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. జడ్చర్లలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్చర్ల సిగ్నల్‌గడ్డ సమీపంలోని ఎర్ర గుట్ట వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు దారేదని, అలాగే మిషన్‌ భగీరథ డబ్ల్యూటీపీకి దారేదని ప్రశ్నించారు. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి మట్టిని ఎక్కడినుంచి తెచ్చారని, అందుకు సంబంధించి సీనరీస్‌ చెల్లింపు అంశాన్ని బహిరంగ పర్చాలని కోరారు. పట్టణంలో రైల్వేగేటు సమస్య అలాగే ఉందని, సిగ్నల్‌గడ్డ వద్ద బ్రి డ్జి నిర్మాణం జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలెదు ర్కొంటున్న సమస్యలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం పోరాటం చే స్తామన్నారు. సమావేశంలో నాయకులు నిత్యానందం, శ్రీధర్‌రెడ్డి, కొల్లూరు ఎంపీటీసీ సభ్యుడు తులసీరాంనాయక్‌, రాములునాయక్‌, నర్సిములు, మీనాక్షి, లక్ష్మమ్మ, ఆనంద్‌ తదితరులున్నారు. అంతకుముందు ఆయన మండలంలోని నెక్కొండలో కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారికి పూజలు చేశారు. 

Read more