ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

ABN , First Publish Date - 2022-09-11T04:28:10+05:30 IST

వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని కల్వకుర్తిలో ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

- నివాళులర్పించిన మంత్రి మహమూద్‌ అలీ, పలువురు నాయకులు


కల్వకుర్తి, సెప్టెంబరు 10: వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని కల్వకుర్తిలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి మం త్రి మహమూద్‌ అలీ, ఎంపీ రాములు, ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, పలు వురు నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఐలమ్మ విగ్రహ కమిటీ కన్వీనర్‌ మొగిలి దు ర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి వేడుకలకు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి ఘన నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను కొని యాడారు. అదేవిధంగా మండల పరిధిలోని జిల్లెల్ల గ్రా మంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య క్రమానికి సర్పంచ్‌ ఎముక జంగయ్య హాజరై ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ సత్యం, జడ్పీటీసీ సభ్యుడు భర త్‌ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, బీసీ సబ్‌ప్లాన్‌ నాయకులు రాజేందర్‌, పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.Read more