అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

ABN , First Publish Date - 2022-09-22T04:53:17+05:30 IST

మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసిడింగ్‌ పత్రాలను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నాయకులకు అందజేశారు.

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ప్రొసిడింగ్స్‌ అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ప్రొసిడింగ్స్‌ అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హన్వాడ సెప్టెంబరు 21 : మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసిడింగ్‌ పత్రాలను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నాయకులకు అందజేశారు. మండలంలోని హన్వాడ, మాదారం గ్రామాల లో షెడ్లు, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి మంజూరైన నిధుల ప్రొసీడింగ్‌ పత్రాల ను బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులకు మంత్రి అందించారు. హన్వాడలోని పీర్లగుట్ట వద్ద షెడ్‌ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు, ఈద్గా కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు, మాదారం గ్రామంలోని ర్యాకమకొండ దేవాలయంవద్ద  కిచెన్‌ షెడ్‌ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రొసిడింగ్‌లను మంత్రి అందజేశారు. అదే విధంగా హన్వాడలో పీర్లమసీద్‌, శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలం ప్రొసీడింగ్‌లను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెహమాన్‌, రైతుబం ధు జిల్లా డైరెక్టర్‌ రమణారెడ్డి, కో-ఆప్షన్‌ మన్నాన్‌, నాయకులు యాదయ్య, రామలింగం, సత్యయ్య, వెంకన్న, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read more