ఘనంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-10-05T04:48:45+05:30 IST

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవా రం గద్వాలలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు
మంత్రి నిరంజన్‌రెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య

- జిల్లా కేంద్రంలో కేక్‌కట్‌ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌

- భారీ వాహన శ్రేణితో వనపర్తికి ర్యాలీ

గద్వాల, అక్టోబరు 4: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవా రం గద్వాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ ఆధ్వర్యంలో నోబుల్‌ స్కూల్‌ నుంచి పాతబస్టాండ్‌ వరకు పెద్ద సంఖ్యలో వాహనశ్రేణితో ర్యాలీ నిర్వహించి వైయస్సార్‌ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భారీ కేక్‌ను కట్‌చేసి మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, జములమ్మ ఆశీస్సులతో ఆయన ఆయురార్యోగాలతో ఉండాలని వారు ఆకాక్షిం చారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి వందవాహనాలలో వనపర్తికి బయలు దేరారు.

గజమాలతో సత్కరించిన జడ్పీ చైర్‌పర్సన్‌

వనపర్తిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డిని గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, తిరుపతయ్యలతో పాటు ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌  గజమాలతో సత్కరించారు. పూల బొకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రికి స్వీట్లు తినిపించారు. పెద్ద ఎత్తున గద్వాల నుంచి కార్యకర్తలు తరలిరావడంతో మంత్రి ఆనందం తో వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గ్రంథా లయ సంస్థ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జోగుళాంబ ఆలయ మాజీ చైర్మన్‌ రవి ప్రకాష్‌ గౌడ్‌, ఆర్‌ కిషోర్‌, అమరవాయి కృష్ణారెడ్డి మంత్రికి శుభా కాంక్షలు తెలిపారు.

- అలంపూర్‌: అలంపూర్‌ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకు లు ఇస్మాయిల్‌ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి నిరంజన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ముందుగా జడ్పీటీసీఒ సభ్యురాలు షంషాద్‌ ఇస్మాయిల్‌ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అలంపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుల్తానాపురం ఎంపీ టీసీ సభ్యురాలు రజియారఫి, కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ ఇబ్రహీం, సింగవరం-1 సర్పంచ్‌ రామ్‌ప్రసాద్‌, సింగవరం-2 సర్పంచ్‌ అనితసాయి బాబ, ఊట్కూరు సర్పంచ్‌ అయ్య స్వామి, బైరంపల్లి సర్పంచ్‌ అయ్య న్న, కోనేరు సర్పంచ్‌ లక్ష్మన, అలం పూర్‌ మార్కెట్‌ కమిటీ  డైరెక్టర్‌ నా గశేషన్ననాయుడు, నాయకులు  రాధాకృష్ణ,  లక్ష్మన్న, జగన్మోహన్‌ రెడ్డి, రాముడు, శంకర్‌, సూరజ్‌సింగ్‌, సూర్యనాయుడు, అంజి, శ్రీపతి నాయుడు, మధు, శేఖర్‌, వెంకటేష్‌, స్వామినాయుడు, రఘుపతి నాయు డు, రాజు, స్వాములు, లక్ష్మీనారా యణ, నాయక్‌, నాగరాజు, మున్నానాయక్‌ ఉన్నారు. 

- ఎర్రవల్లిచౌరస్తా: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇటిక్యాల మండంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లి ఆంజనేయస్వామి అలయ సన్నిదిలో ప్రత్యేకపూజలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వనపర్తికి చేరుకొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచులు రవీందర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, అయిజ మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, కిశోర్‌, ఇస్మాయిల్‌, తేజ, గుమ్మగోవర్ధన్‌, గిడ్డారెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరసింహరెడ్డి, రవిప్రకాశ్‌, వెంకట్రాముడు  పాల్గొన్నారు.Read more