కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-11-15T23:16:11+05:30 IST

కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరసింహ ప్రభుత్వా లపై ధ్వజమెత్తారు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
కొల్లాపూర్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న ఎం.నరసింహ

- ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరసింహ

- కొల్లాపూర్‌లో ఏఐటీయూసీ జిల్లా రెండవ మహాసభలు

కొల్లాపూర్‌, నవంబరు 15: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరసింహ ప్రభుత్వా లపై ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని మహబూబ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏఐటీయూసీ జిల్లా రెండవ మహాసభలను నిర్వహించారు. అంతకు ముందు పురవీధుల గుండా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహబూబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏఐటీయూసీ పతాకాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రేమపావని ఆవిష్కరిం చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా మహాసభల్లో నరసింహ కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. మూడు నల్లా చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేసి హక్కులు సాధించారో వారి మాదిరిగా కార్మి కులు కూడా పోరాటాలు చేయాలని పిలుపుని చ్చారు. స్కీం వర్కర్స్‌, అంగన్‌వాడీ, ఆశాలు, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఏఐ టీయూసీ నిత్యం పోరాడుతుందని ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నిర్మా ణ బాధ్యులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.బాలనర సింహ, రాష్ట్ర నాయకుడు ఎస్‌ఎండీ.ఫయాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్‌, సీపీఐ జిల్లా కా ర్యవర్గ సభ్యులు కే.ఏసయ్య, పి.నరసింహ, పెబ్బే టి విజేయుడు, మహిళా ప్రధాన కార్యదర్శి ఇంది ర, నాయకులు బొల్లెద్దుల శ్రీనివాసులు, లక్ష్మీపతి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌ కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మారేడు శివశంకర్‌, సీపీఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, హమాలీలు, గ్రామ పంచాయతీ కార్మికు లు, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:16:11+05:30 IST

Read more