రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-11-24T23:24:51+05:30 IST

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెంచికలపాడు, ఆరగిద్ద, మాచర్ల గ్రామాల్లో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గట్టు, నవంబరు 24 : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెంచికలపాడు, ఆరగిద్ద, మాచర్ల గ్రామాల్లో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రైతు వేదికలను ప్రారంభించారు. పెంచికలపాడు, ఆరగిద్ద, మాచర్ల గ్రామాల్లో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ, ఎస్సీ, మైనారిటీ కమ్యూనిటీ హాల్స్‌ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పెంచికలపాడులో రైతు వేదికను ప్రారంభించారు. ఈ ంందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌గౌడ, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల, వైస్‌ ఎంపీపీ సుమతి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతునాయుడు, పీఎసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, సర్పంచ్‌లు శశికళ, సిద్ధిరామప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:24:51+05:30 IST

Read more