ఉమామహేశ్వరంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-27T05:35:23+05:30 IST

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒక్కటైన ఉమామహేశ్వరం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

ఉమామహేశ్వరంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
- శైలపుత్రిగా పార్వతీదేవి

అచ్చంపేట, సెప్టెంబరు 26: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒక్కటైన ఉమామహేశ్వరం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. దసరా పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల తొలిరోజైన సోమవారం ఆలయంలోని పార్వతిదేవిని శైలపుత్రి దేవి గా అలంకరించారు. అర్చకులు వీరయ్యశాస్త్రీ ఆధ్వర్యం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుం కుమార్చన, అభిషేక పూజలు చేశారు. తెలంగాణ, కర్ణా టక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆల యాన్ని దర్శిచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లయంలోని పార్వతి, పరమేశ్వరులకు క్షీరాభిషేకం చేశా రు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కందూరు సుధాకర్‌, ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకు లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. 

 అచ్చంపేటఅర్బన్‌: దసర ఉత్సవాలలో భాగంగా  సోమవారం మండల పరిధిలోని నడింపల్లి, లక్ష్మాపూర్‌, లింగోటం, పుల్జాల, పల్కపల్లి, తదితర గ్రామాల్లో దుర్గా మాత నిర్వాహకులు అమ్మవారిని ఆయా గ్రామాల్లో మండపాలలో అమ్మవారిని కొలువుదీర్చారు.  అదే విధం గా మహిళలు వివిధ పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆట పాటలతో సందడి చేశారు. 

 తాడూరు: మండల కేంద్రంతోపాటు మండలం లోని ఇంద్రకల్‌, సిర్సవాడ, ఐతోల్‌, భలాన్‌పల్లి తదితర గ్రామాల్లో సోమవారం దుర్గా శరన్నవరాత్రులను పుర స్కరించుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాలను ప్రతి ష్ఠించడం జరిగింది. వేద పండితులు అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం ఆయా దుర్గా మండపాల వద్ద భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.  

పెంట్లవెల్లి:  మండలంలోని జటప్రోల్‌, గోప్లాపూ ర్‌, పెంట్లవెల్లి గ్రామాల్లో దుర్గామాత పూజలు ఘనంగా నిర్వహించారు. జటప్రోల్‌లో మదనగోపాలస్వామి ఆల య సమీపంలో దుర్గామాతను ఏర్పాటు చేసి వైస్‌ ఎం పీపీ భీంరెడ్డి, మాజీ ఎంపీపీ గోవిందుగౌడ్‌ల ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పెంట్లవెల్లిలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జటప్రోల్‌ గ్రామస్థులు గోపాల్‌, తిరుపాయాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, పల్లకి సే వ, గోసేవ ఆలయ ఫౌండర్‌ ట్రస్టి జూలూరి రమేష్‌ బాబు ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభ మయ్యాయి.  ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, కోశాధికారి వెంకటేశ్‌, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమిచెర్ల రమేష్‌, అదనపు కార్యదర్శి చిగుళ్లపల్లిశ్రీధర్‌, కోశాధికారి జగదీశ్వర్‌, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

మన్ననూర్‌: మండల కేంద్రంలోని అమరేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శైలపుత్రీదేవి అలంకరణతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాటేపల్లి శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజు, మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Read more