ప్రజల మన్ననలు పొందాలి

ABN , First Publish Date - 2022-11-25T00:04:28+05:30 IST

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహిం చాలని డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రజల మన్ననలు పొందాలి
స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఎస్పీ

మరికల్‌, నవంబరు 24 : ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహిం చాలని డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువా రం మరికల్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాల ను పరిశీలించి, పోలీస్‌ సిబ్బంది పరేడ్‌ వీక్షించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధు ల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసులను తర్వగా పూర్తి చేయాలని సూ చించారు. ప్రతీ ఒక్కరు సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఫం క్షనల్‌, వర్టికల్స్‌పై సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రతీ ఒక్కరు యూనిఫామ్‌ కలిగి ఉండాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలన్నారు. విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేక మవుతూ సమస్యలు తెలుసుకోవాలన్నారు. దొంగతనల నిర్మూలనకు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించి, ఆకస్మికంగా వాహనాలు తనిఖీ చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ అశోక్‌బాబు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నేరాల నిర్మూలకే కార్డన్‌ సెర్చ్‌ : డీఎస్పీ

మాగనూరు : నేరాల నిర్మూలకే కార్డన్‌సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మాగనూరులో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, పది మంది ఏఎస్‌ఐలు, ఐదుగురు హెచ్‌సీలు, 50 మంది పీసీలు, ఐదుగురు డబ్ల్యూపీసీఎస్‌, ఐదుగురు హెచ్‌జీఎస్‌ సిబ్బంది మొత్తం 85 మంది పోలీసులు అధికారులు, సిబ్బందితో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించడం జరిగింది డీఎస్పీ అన్నారు. నాలుగు టీంలుగా వీడిపోయి నాలుగు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. 118 ఇళ్లను సోదా చేసి, సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపిస్తే తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాపార సముదాయాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. మక్తల్‌ సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సీతయ్య, రాంలాల్‌, ఎస్‌ఐలు నరేందర్‌, రాములు, పర్వతాలు, అశోక్‌, విజయభాస్కర్‌, విక్రమ్‌, సర్పంచు రాజు, మాజీ సర్పంచు ఆనంద్‌గౌడ్‌, చెన్నప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:04:30+05:30 IST