గాంధీజీ మార్గం అనుసరణీయం

ABN , First Publish Date - 2022-10-03T04:36:48+05:30 IST

మహాత్మా గాంధీ జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా అధికారులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.

గాంధీజీ మార్గం అనుసరణీయం
పేటలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న పీఆర్టీయూ టీఎస్‌ సభ్యులు

- గాంధీ జయంతి వేడుకల్లో పలువురు వక్తలు 

- గాంధీ చిత్రపటానికి ఘన నివాళి

నారాయణపేట/టౌన్‌/క్రైం, అక్టోబరు 2 : మహాత్మా గాంధీ జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా అధికారులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్పీ సీఈవో జ్యోతి, సిబ్బంది పాల్గొనగా, డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌ నర్సిములు గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించగా డీఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు విజయ్‌సాగర్‌, చెన్నారెడ్డి, వినోద్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌, అమీరుద్దిన్‌, విద్యావతి, కార్తీక్‌, సుభాష్‌, రఘు, రాములు, నాగరాజ్‌, రాజవర్దన్‌రెడ్డి, సుదర్శన్‌, ప్రతాప్‌రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. నాయకులు రతంగ్‌పాం డురెడ్డి, ప్రభాకర్‌ వర్ధన్‌, విజయ్‌, మహాబూబ్‌ అలీ, సా యిబాబు, లక్ష్మీశ్యాం, రఘురామయ్య పాల్గొన్నారు. కాం గ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌, సలీం, రవీందర్‌రెడ్డి, శరణప్ప, రమేష్‌, జలీల్‌, అఖిల్‌, యూసూఫ్‌, భీంప్రకాష్‌, సత్యరెడ్డి, విజయ్‌, శేఖర్‌, నారాయణ పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్ర హానికి నివాళి అర్పించారు. నాయకులు జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రఘువీర్‌, జనార్ధన్‌, భాస్కర్‌, సంతోష్‌ పాల్గొన్నారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, టీఎస్‌ యూటీఎఫ్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమా ల్లో నాయకులు బాలాజీ, భీమయ్య, రవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, అనుబంధ సంఘాల నాయ కులు శ్రీనివాసులు, భీమేష్‌, రవి, వెంకటయ్య, సాయిలు పాల్గొన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి, సభ్యు లు నాగరాజ్‌, సుభాష్‌, చెన్నారెడ్డి, జగదీశ్‌ పాల్గొన్నారు.

గాంధీజీ జీవితం ఆదర్శం

గాంధీజీ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. డీసీఆర్పీ డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఎస్‌ఐ వసంత, సిబ్బంది పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : మండలంలోని బోయిన్‌పల్లి, సింగారం, అప్పిరెడ్డిపల్లి, మీదితండా, పేరపళ్ల గ్రామాల్లో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ధన్వాడ : గాంధీ జయంతి సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. గ్రామ కార్యదర్శి శేఖర్‌, బిల్‌ కలెక్టర్‌ బాలకృష్ణ, కారోబార్‌ భాను, కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మయ్యగౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, బాల్‌రాజు పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి వాణిజ్య సంఘం సభ్యులతో పాటు అభిలపక్షం నాయకు లు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్‌ఐ అశోక్‌బాబు, వాణిజ్య సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, శరత్‌బాబు, సుధాకర్‌గౌడ్‌, బాల్‌రెడ్డి, గోవర్ధన్‌,శ్రీను, అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు.

కృష్ణ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసీల్దార్‌, మండల పరిషత్‌, వ్యవసాయ, పోలీస్‌స్టేషన్‌, పంచాయతీ కా ర్యాలయాల వద్ద గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ మహత్ముడు వేసిన బాటలో నడవాలన్నారు. తహసీల్దార్‌ రామకోటి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్‌ఐ విజ యభాస్కర్‌, ఏవో సుదర్శన్‌గౌడ్‌, ఎంపీవో విజయలక్ష్మి, ఆర్‌ఐ మధన్‌మోహన్‌రెడ్డి, సర్పంచులు రేణుక, సావిత్రి, శివప్ప, రామకృష్ణ ధణి, లక్ష్మినారాయణగౌడ్‌, పంచాయతీ కార్యదర్శులు స్వామినాథ్‌, ఆంజనేయులు, ఉప సర్పంచు సద్దాం హుస్సేన్‌, హానిఫ్‌ పాల్గొన్నారు.

మాగనూరు : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంపీపీ శ్యామలమ్మ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సింగి ల్‌విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్యామలమ్మ, ఎల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ తిప్పయ్య, సర్పంచులు అశోక్‌గౌడ్‌, రాజు, నర్సిములు, నిర్మలాదేవి, వెంకట మ్మ, తిమ్మప్ప, నారాయణ, లక్ష్మమ్మ, పద్మమ్మ, మంజుల, తారమ్మ, జానకమ్మ, రామస్వామి, అంజమ్మ పాల్గొన్నారు.

నర్వ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి నాయకులు, గ్రామ స్థులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా వీఆర్‌ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

దామరగిద్ద : గాంధీ జయంతి సందర్భంగా మం డలంలోని దామరగిద్ద, మున్కన్‌పల్లి గ్రామాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మక్తల్‌ :  భారత దేశ రెండో ప్రధాని లాల్‌బహ దూర్‌శాస్త్రీ, మహాత్మాగాంధీ జయంతి వేడుకలను పుర స్కరించుకొని ఆదివారం మక్తల్‌ పట్టణంలోని విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌, తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం, జక్లేర్‌ ఆర్యవైశ్య సంఘం, మక్తల్‌ వాసవీ క్లబ్‌, లయన్స్‌క్లబ్‌, ఆర్యవైశ్య సంఘం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, తె లంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు భీంరెడ్డి, సురేష్‌కుమార్‌ గాంధీ సేవలను కొనియాడారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు, కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌ కుమార్‌, గణేష్‌ కుమార్‌, గోవర్ధన్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు అనిల్‌గౌడ్‌, దత్తురావు, నర్సిరెడ్డి, న ర్సిములు, నాగార్జున, భీంరెడ్డి, వెంకట్రాములు, కురుమ య్య, చంద్రశేఖర్‌, వీహెచ్‌పీ నాయకుడు సత్యనారాయణ గౌడ్‌, భీంరెడ్డి, జగదీష్‌, రాకేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మక్తల్‌ రూరల్‌ :  మండలంలో చిట్యాల, జక్లేర్‌, అనుగొండ, దాదాన్‌పల్లి, పంచదేవపహాడ్‌ గ్రామాల్లోని గ్రామ పంచాయతీల వద్ద గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించారు. సర్పంచులు నర్సిములు, జానకి, లక్ష్మణ్‌, కల్పన, కృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఊట్కూర్‌లో సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి  నివాళి అర్పించి గ్రామ సభ నిర్వహించారు.  పులిమామిడిలో గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించి గ్రామ సభ నిర్వహించారు.  కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు యగ్నేశ్వర్‌రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లయన్‌క్లబ్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి నివాళి అర్పించగా, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వాలీవాల్‌ కిట్‌ అందించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ తిరుపతయ్య, తిప్రస్‌పల్లిలో సర్పంచ్‌ సుమంగళ, పగిడిమారిలో టీఆర్‌ఎస్‌ నాయకుడు జాఫర్‌ మహాత్ముడికి నివాళి అర్పించారు. సింగిల్‌ విండో అధ్యక్షడు బాల్‌రెడ్డి, ఊట్కూర్‌ ఉపసర్పంచ్‌ ఇబాదుర్‌రహెమాన్‌, ఎంపీటీసీ సభ్యుడు హన్మంతు, రవికుమార్‌, కోఅప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ రహెమాన్‌, మాజీ జడ్పీటీసీ  అరవింద్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 
Read more