గజగజ

ABN , First Publish Date - 2022-12-09T23:11:27+05:30 IST

ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగత్రలు 17-18 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.

గజగజ
మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చలిమంట కాచుకుంటున్న జనం

నాలుగు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

కల్వకుర్తిలో కనిష్ఠం 12.3 డిగ్రీలు

మహబూబ్‌నగర్‌/గద్వాల/నారాయణపేట/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/వనపర్తి అర్బన్‌, డిసెంబరు 9: ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగత్రలు 17-18 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా శుక్రవారం వాతావరణం మేఘావృతమైంది. చలికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో జనం ముసుగేసుకుంటున్నారు. తలుపులు తెరిస్తే చలికి తాళలేకపోతున్నారు. పల్లెల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. మంకీక్యాప్‌, స్వెటర్లు ధరిస్తున్నారు. ఉదయం పూట పనులకు వెళ్లేవారు, కార్మికులు, చిరు వ్యాపారులు చలికి గజగజవణుకుతున్నారు. మహ బూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రెండ్రోజుల నుంచి పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి మూడు నుంచి నాలుగు గంటలకే జిల్లా కేంద్రానికి రావడం, మైదానం వద్ద ఈవెంట్లకోసం బారులు తీరడంతో చలికి ఇబ్బందిపడుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్పంగా తుంపర వర్షం కురిసింది.

Updated Date - 2022-12-09T23:11:28+05:30 IST