కేసీఆర్‌ హైడ్రామాలో నలుగురు ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-11-02T23:12:08+05:30 IST

మునుగోడు ఎన్నికల్లో బీ జేపీ ప్రభజనం చూసి తట్టుకోలేక కేసీఆర్‌ హైడ్రామాలో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ సీనియర్‌ నాయకుడు స తీష్‌ మాదిగ అన్నారు.

 కేసీఆర్‌ హైడ్రామాలో నలుగురు ఎమ్మెల్యేలు
అచ్చంపేటలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ నుంచి దహనం చేస్తున్న బీజేపీ నాయకులు

అచ్చంపేట, నవంబరు 2: మునుగోడు ఎన్నికల్లో బీ జేపీ ప్రభజనం చూసి తట్టుకోలేక కేసీఆర్‌ హైడ్రామాలో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ సీనియర్‌ నాయకుడు స తీష్‌ మాదిగ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ప్రచారం పూర్తిచేసుకొని వెళుతున్న ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి నిరసనగా బుధవారం అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ప్రభజనం చూసి తట్టుకోలేక ఎమ్మెల్యూల కొనుగోలు డ్రామాలడార న్నారు. వీరిమీద రూపాయి పెడితే ఎవడూ కొనడని, అలాంటిది రూ.100కోట్లు పెట్టి ఎవరు కొంటారన్నారు. అది నిజమని నమ్మితే 7వ తేదీన ఉమామహేశ్వర క్షే త్రంలో పాపనాశిని గుండంలో మునిగి శివుడ్ని ము ట్టుకుందామన్నారు. దానికి బీజేపీ నాయకులు సిద్ధం అని అన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వచ్చి తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. నాయకులు బాలాజి, శ్రీను, శివచంద్ర, చందులాల్‌, దేవేందర్‌ రెడ్డి, కార్తీక్‌ రెడ్డి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈటలపై దాడి హేయమైన చర్య

పెద్దకొత్తపల్లి: మునుగోడులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని పెద్దకొత్తపల్లి బీజేపీ అధ్యక్షుడు పదిర భీమేష్‌ అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో ఈటలపై జరిగిన దాడిని నిరసిస్తూ పెద్దకొత్తపల్లి బస్టాండ్‌ చౌరస్తాలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల ఇన్‌చార్జి కడ్తాల కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శులు తిరుమల్‌యాదవ్‌, మల్లేష్‌, మండల ఉపాధ్యక్షుడు సతీ ష్‌, సరాయి శేఖర్‌, కార్యదర్శి సిద్దార్థ, నాగరాజు, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు సుధాకర్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మా ర్కండేయ, జగదీశ్‌, శివ, రాము, మల్లేష్‌, శరత్‌బాబు, విజయ్‌, ఉపేందర్‌, చంద్రశేఖర్‌, బాబు పాల్గొన్నారు.

బిజినేపల్లి: మునుగోడులో ఎన్నికల ప్రచారం చేస్తున్న మత్స్యకార కులానికి చెందిన ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ దంపతులపై చేసిన దాడి అగ్ర వర్ణాల అహంకారానికి నిదర్శనమని మండల మత్స్యకార సహ కార సంఘం అధ్యక్షుడు తుమ్మల అల్లోజి అన్నారు. మండల కేంద్రంలోని మండల మత్స్యకార సహకార సం ఘం భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారులు టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకం కాదని, ముదిరాజ్‌ కమ్యూనిటికి చెందిన నా యకులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు వెనకా డబోమని హెచ్చరించారు. మండల మత్స్యకార సహకా ర సంఘం ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యక్షుడు బోల కృష్ణయ్య, సలహాదారుడు మిద్దె యాదయ్య, బిజినేపల్లి మత్స్యకార సహకార సంఘం కార్యదర్శి కంపిండ్ల పర్వతాలు, వడ్డెమాన్‌ సహాకార సంఘం అధ్యక్షుడు శంకరయ్య, ఇరుబంద శ్రీనివాసులు, భీమని సాయిబాబు, భీమని మహేష్‌, మండల నాగరాజు తదితరులు ఉన్నారు.

బల్మూరు: మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అధికార పార్టీ నాయ కులు, కార్యకర్తలు దాడి చేయడంపై నిరసనగా బుధవా రం మండల కేంద్రంలోని గాంధీచౌరస్తాలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దహ నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దులు యాదవ్‌ మాట్లాడారు. మండల కార్యదర్శి గడిల రమేష్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతయ్యగౌడ్‌, తోడలగడ్డ సర్పంచ్‌ రమేష్‌, కార్యకర్తలు నరేష్‌, చందు, తిరుపత య్య, రమేష్‌, శరత్‌, శివ, భాస్కర్‌, హరికృష్ణ, మల్లేష్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:12:08+05:30 IST
Read more