రాష్ట్రంలో క్రీడలకు ఆదరణ కరువు

ABN , First Publish Date - 2022-03-18T05:37:55+05:30 IST

రాష్ట్రంలో క్రీడలకు ఆదరణ కరువయ్యిందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో క్రీడలకు ఆదరణ కరువు
కర్నూల్‌ క్రీడాకారులకు బహుమతి అందిస్తున్న జితేందర్‌రెడ్డి

- మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

అయిజ, మార్చి 17 : రాష్ట్రంలో క్రీడలకు ఆదరణ కరువయ్యిందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బంగారు లక్ష్మణ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్‌ పేరున ఆయన కుమారుడు సాయి, కుమార్తె శ్రుతి ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, క్రీడా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఓపెన్‌ కబడ్డీ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 54 టీములు పాల్గొనడం విశేషం అన్నారు. పోటీల్లో మొదటి బహుమతిని సాధించిన కర్నూల్‌ జట్టును అభినందిస్తూ, మా అత్తగారి ఊరి పేరు నిలబెట్టారని సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు అప్సర్‌బాషా, అశ్వత్థామరెడ్డి, అశోక్‌, శేఖర్‌, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read more