వైద్య బతుకమ్మకు మొదటి బహుమతి

ABN , First Publish Date - 2022-09-29T05:11:18+05:30 IST

బుధవారం జిల్లా పరిషత్‌ మైదా నంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినులు, వైద్యాధి కారులు మొదటి బహుమతి సాధించారు.

వైద్య బతుకమ్మకు మొదటి బహుమతి
అదనపు కలెక్టర్‌తో బహుమతి అందుకుంటున్న వైద్యవిద్యార్థినులు, అధికారులు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), సెప్టెంబరు 28 : బుధవారం జిల్లా పరిషత్‌ మైదా నంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినులు, వైద్యాధి కారులు మొదటి బహుమతి సాధించారు. రెండో బహుమతి పశు సంవర్ధక శాఖ, మూడో బహుమతి మెప్మా మహిళలు గెలుచుకున్నారు. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమా నికి అదనపు కలెక్టర్‌ సీతారామారావు ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన వారికి బహు మతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక, పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, డీటీసీపీవో, డిప్యూటీ సీఈవో మొగులప్ప పాల్గొన్నారు.a

Read more