పండుగలు జాతి ఐక్యతకు దోహదపడతాయి

ABN , First Publish Date - 2022-10-04T05:08:44+05:30 IST

పండు గలు జాతి ఐక్యతకు దోహదపడతాయని ఎక్సై జ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి డాక్టర్‌ శ్రీని వాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

పండుగలు జాతి ఐక్యతకు దోహదపడతాయి
కోటకదిరలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌, ఆసరా పింఛన్ల పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 3: పండు గలు జాతి ఐక్యతకు దోహదపడతాయని ఎక్సై జ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి డాక్టర్‌ శ్రీని వాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశం లో, ఏ మతంలో లేనన్ని పండుగలు హిందూ సంప్రదాయంలో ఉన్నాయని, బతుకమ్మ పండుగ మొదలుకొని అన్నిరకాల పండుగలను నిర్వహిస్తున్న జాతి హిందూజాతి అని అన్నా రు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్ర తీ ఒక్కరు కలిసిమెలిసి చేసుకునేందుకు పండుగలు దోహదం చేస్తాయని అన్నారు. వచ్చే సంవత్సరం ట్యాం కుబండ్‌, ఐలాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిం చుకునే ఏర్పాటుచేస్తామని అప్పటివరకు పనులు పూ ర్తవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ మురళీధర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ గోపాల్‌ యాదవ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ.నరసింహులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం చేసేందుకే జాతీయ రాజకీయాల్లోకి..

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణలో అమలవు తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీ ఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మహ బూబ్‌నగర్‌ మండలంలోని కోడూరు, అప్పాయిపల్లి, ఓ బ్లాయిపల్లితండా, ఓబ్లాయిపల్లి, కోటకదిర, పోతన్‌పల్లి, మాచన్‌పల్లి, రాంచంద్రాపూర్‌ గ్రామాల్లో బతుకమ్మ చీ రలు, ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ, సీ ఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కోడూరులో మహిళలతో కలి సి బతుకమ్మ పాటలు ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్ర మాల్లో ఎంపీపీ సుధాశ్రీరాఘవేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ స భ్యుడు పుల్లూరి వెంకటేశ్వరమ్మరవీందర్‌రెడ్డి, వైస్‌ ఎం పీపీ అనితాపాండురంగారెడ్డి, మాడా డైరెక్టర్‌ ఆంజనే యులు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మల్లు నర సింహారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్‌, ఊశన్న, అంజమ్మదశరథ్‌, చంద్రకళావెంకటస్వామి, రమాదేవేందర్‌, సత్యమ్మ, మల్లి కార్జున్‌రెడ్డి, రాణమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:08:44+05:30 IST