విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-12-13T22:57:04+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని పెద్దపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

విద్యుదాఘాతంతో రైతు మృతి

తెలకపల్లి, డిసెంబరు 13 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని పెద్దపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బాలరాజు (40) గ్రామంలో పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చే స్తున్నాడు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న ఫీజులను మార్చుతుండగా విద్యుదాఘాతా నికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్ప త్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృ తునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుని కుమారు డు అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-12-13T22:57:04+05:30 IST

Read more