ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు

ABN , First Publish Date - 2022-11-16T23:27:02+05:30 IST

మండల కేంద్రంలో అంబాభవానీ జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సహభరితంగా కొనసాగాయి.

ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు
సందెరాయి ఎత్తిన కర్ణాటక వాసి

- విజేతలుగా కర్ణాటక వాసులు

గట్టు, నవంబరు 16 : మండల కేంద్రంలో అంబాభవానీ జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సహభరితంగా కొనసాగాయి. మండల టీఅర్‌ఎస్‌ పార్టీ అద్యక్షుడు రామకృష్ణారెడ్డి పోటీలను ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల యువకులతో పాటు, కర్ణాటకకు చెందిన వారు పాల్గొన్నారు. హోరాహోరిగా జరిగిన ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన ప్రతాప్‌ 100 కేజీల సందెరాయి ఎత్తి ప్రథమ బహుమతిని సాధించడంతో ఐదు వేల రూపాయలు బహుమతిగా అందించారు. 95 కిలోల రాయి ఎత్తి ద్వితీయ బహుమతిని సాధించిన కుంసి నరసింహులుకు మూడు వేల రూపాయలు అందించారు. కుకునూర్‌ అంపయ్య 93 కిలోల రాయి ఎత్తి తృతీయ బహుమతిగా రెండు వేల రూపాయలు, గట్టు అంజి 90 కేజీల రాయి ఎత్తి నాలుగవ బహుమతిని సాధించి వెయ్యి రూపాయలను బహుమతిగా అందుకున్నారు. కార్యక్రమంలో టీఅర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సంతోష్‌, అంగడి బస్వరాజ్‌, రాము, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:27:02+05:30 IST

Read more