పోడు భూముల ప్రతీ దరఖాస్తును పరిశీలించాలి

ABN , First Publish Date - 2022-11-30T23:19:32+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పోడు భూముల కోసం వచ్చిన ప్రతీ క్లెయిమ్స్‌ను సర్వే చేయడంతో పాటు, గ్రామసభ నిర్వహించి సబ్‌ డివిజనల్‌ లెవల్‌ కమిటీకి పంపించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశిం చారు.

పోడు భూముల ప్రతీ దరఖాస్తును పరిశీలించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- నిర్లక్ష్యం చేస్తే చర్యలు - కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

కొల్లాపూర్‌, నవంబరు 30: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పోడు భూముల కోసం వచ్చిన ప్రతీ క్లెయిమ్స్‌ను సర్వే చేయడంతో పాటు, గ్రామసభ నిర్వహించి సబ్‌ డివిజనల్‌ లెవల్‌ కమిటీకి పంపించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశిం చారు. కొల్లాపూర్‌ డివిజన్‌లో వచ్చిన పోడు క్లెయిమ్స్‌పై మంగళవారం రాత్రి కొల్లాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కో పంచాయతీ సెక్రటరీ పరిధిలో వచ్చిన మొత్తం క్లెయిమ్స్‌ ఎన్ని, అందులో గిరిజనుల, గిరిజ నేతరుల క్లెయిమ్స్‌ ఎన్ని ఉన్నాయి, వాటిని గ్రామసభ నిర్వహించి ఎన్ని సబ్‌ లెవల్‌ కమిటీకి పంపించారో అడిగి తెలుసుకున్నారు. వచ్చిన క్లెయిమ్స్‌కు సర్వే అనంతరం గ్రామసభ నిర్వహించి, గ్రామసభలో సమర్పించిన ఆధారాలతో రెజల్యూషన్‌ పాస్‌ చేసి డివిజనల్‌ లెవల్‌ కమిటీకి రేపటిలోగా సమర్పించాల ని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్లెయిమ్స్‌కు సంబంధించిన మ్యాపింగ్‌ రేపటిలోగా పూర్తి చేయాలని అటవీశాఖ అధికా రులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో హనుమానాయక్‌, ఎఫ్‌డీవో నవీన్‌ రెడ్డి, డీటీడబ్ల్యూవో అనిల్‌ప్రకాశ్‌, డీపీవో కృష్ణ, డీఎల్‌పీవో రామ్మోహన్‌రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:19:34+05:30 IST