దుకాణ సముదాయం ప్రారంభం ఎప్పుడో

ABN , First Publish Date - 2022-12-12T23:24:30+05:30 IST

మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆధ్వర్యంలో 26 దుకాణ సముదాయాలు నిర్మించి మూడేళ్లు దాటినా, ప్రారంభానికి నోచుకోవడం లేదు.

దుకాణ సముదాయం ప్రారంభం ఎప్పుడో
వృథాగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ దుకాణ సముదాయాలు

- పూర్తి అయినా ప్రారంభానికి నోటుకోని వ్యవసాయ మార్కెట్‌ దుకాణ సముదాయాలు

- ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి గండి

మక్తల్‌, డిసెంబరు 12 : మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆధ్వర్యంలో 26 దుకాణ సముదాయాలు నిర్మించి మూడేళ్లు దాటినా, ప్రారంభానికి నోచుకోవడం లేదు. పట్టణంలోని సంగంబండ రోడ్డులో మార్కెట్‌ యార్డుకు విలువైన స్థలం ఉండటంతో దుకాణ సముదాయాలు నిర్మించాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సహకారంతో మార్కెటింగ్‌ శాఖ మంత్రితో అనుమతులు తీసుకొని గత 2017 జూలైలో రూ.1.18 కోట్ల వ్యయంతో దుకాణ సముదాయాలకు భూమిపూజ చేశారు. నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ దుకా ణ సముదాయాలను వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి గత 2019లో ప్రారంభించారు. ఈ దుకాణ సముదాయా ల సమీపంలోని ప్రైవేటు వ్యక్తుల దుకాణాలకు నెలకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. అప్పట్లోనే వీటికి టెండర్లు పిలిచి ఉంటే నెలకు రూ.2 లక్షల పైచిలుకు అద్దె రూపంలో మార్కెట్‌కు ఆదాయం సమకూరేది. ఇప్పటి వరకు దాదాపు రూ.కోటికి పైగా ఆదాయం వచ్చి ఉండేదని పలువురు అభిప్రాయపడుతు న్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా దుకాణ సముదాయాలకు టెండర్లు పిలవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి 167 విస్తరణతో అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలు కోల్పోయారు. వారంతా మార్కెట్‌ దుకాణ సముదాయాలకు ఎప్పుడు టెండర్లు నిర్వహిస్తారా.. అని ఆశగా ఎదురుచూస్తున్నా రు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే మార్కెట్‌ యార్డు దుకాణ సముదాయాలకు టెండర్లు నిర్వహించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:24:30+05:30 IST

Read more