ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2022-12-09T23:21:53+05:30 IST

ఉద్యోగులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు.

 ఉద్యోగులు సమయపాలన పాటించాలి
ఆర్డీవో కార్యాలయంలో అటెండెన్స్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష

- ఆర్టీవో కార్యాలయం తనిఖీ

- పలువురు సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 9: ఉద్యోగులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయా న్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యా లయంలో ఆర్డీవో చాంబర్‌, వివిధ విభాగాలను పరిశీలించి అటెండెన్స్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది లేకపోవడంతో డీటీ ద్వారా సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు సెలవు పెట్టగా వారిసెలవు మంజూరు పత్రాలను పరిశీలించి మిగతా వారు గైర్హాజరు కావడంపై ఆరా తీశారు. ఎవరూ కూడా అనుమతి లేకుండా సెలవులపై వెళ్లరా దని, ముందస్తు సమాచారం సంబంధిత అదికారికి ఇవ్వాలని, విధిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ సిబ్బందికి సూచించారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌..

నాబార్డ్‌ వారు రూపొందించిన పొటెన్షియల్‌ లింకడ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ 2023- 24 పుస్తకాన్ని కలెక్టర్‌ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. వార్షిక ప్రణాళిక, క్రాఫ్‌ లోన్‌లకు రూ.1834.08, టర్మ్‌ లోన్‌లకు రూ.407.40, ఎంఎస్‌ ఎంఈలకు రూ.176.41, మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ.2,669.66 కోట్లకు సంబంధించిన ప్రణాళికను రూ పొందించారు. ఈ ప్రణాళిక ఆధారంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూపొందించనున్నారు. కార్యక్రమంలో నాబార్డ్‌ డీడీఎం ఎంబీ ఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌, ఆర్బీఐ సాయి చరణ్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్‌, ఎస్‌బీఐ ఏజీఎం శ్రావణ్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌, జిల్లా మేనేజర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

నారాయణపేట టౌన్‌: ధరణి పోర్టల్‌లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని ధరణి పోర్టల్‌ను రూపొందించిదన్నారు. మీ సేవ ద్వారా రైతులు ఆర్జి పెట్టుకున్న వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటి వరకు ఉన్నవాటిని టీఎం 33, మ్యూటేషన్‌, సక్షేషన్‌లను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని, ప్ర భుత్వ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే తన దృష్టికి తేవాలని సూచిం చారు. గతనెల 26, 27, ఈనెల 3, 4 తేదీల్లో ఓటర్‌ ఎన్‌రోల్‌మెంట్‌ క్యాంపెయిన్‌ నిర్వహించామని అందులో ఫారం 6, 7, 8లలో 14,831 కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి ఫైనల్‌ పబ్లికేషన్‌ జనవరి 5, 2023న విడుదల చేస్తామ న్నారు. 2022 జనవరి 5నుంచి నవంబరు వరకు 1,197 మంది 18, 19 ఏళ్ల వయసు వారు కొత్త ఓటర్లుగా గుర్తించబడ్డారన్నారు. దరఖాస్తుదారులు సమస్యలతో తమ వద్దకు వస్తారని సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, ఏవో నర్సింగ్‌రావు, పీఎస్‌ నాగేందర్‌, జగదీశ్వర్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:21:55+05:30 IST