అభివృద్ధి సొబగులు

ABN , First Publish Date - 2022-12-02T00:10:54+05:30 IST

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గ అధికారిక పర్యటనకు రంగం సిద్ధ మైంది.

అభివృద్ధి సొబగులు
ముఖ్యమంత్రి ప్రారంభించనున్న మహబూబ్‌నగర్‌ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం

- ప్రారంభానికి ముస్తాబైన నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌

- రూ.55 కోట్లతో నిర్మితమైన కార్యాలయాల ప్రాంగణం

- రూ.500 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

- 24 గంటలు అందనున్న వైద్య సేవలు

- ప్రారంభించనున్న మినీ శిల్పారామం ఆర్చి

- 4న పాలమూరుకు వస్తోన్న సీఎం కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గ అధికారిక పర్యటనకు రంగం సిద్ధ మైంది. 4వ తేదీన సీఎం కేసీఆర్‌ పర్యటన ఖరారవడంతో అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చకచకా సాగుతున్నా యి. కొత్తగా నిర్మితమైన జిల్లా అధికార కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌), టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యా లయ ప్రారంభోత్సవంతో పాటు కొత్తగా నిర్మించ తల పెట్టిన మల్టీస్పెషాల్టీ ఆసుపత్రికి శంకుస్థాపన, పాల మూరు శిల్పారామం ఆర్చికి ప్రారంభోత్సవం, మినీ ట్యాం కు బండ్‌లో నిర్మితమవుతోన్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో నూతనంగా ఏర్పాటు చేయదలచిన బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌కు శంకుస్థాపన చేయనుండడంతో పాటు ఎంవీఎస్‌ కాలేజీలో నిర్వహించ నున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న నేపథ్యంలో అధికారవర్గాల్లో హడావిడి మొదలైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు స్వయంగా ఏర్పాట్లపె అధికారులకు సూచనలందిస్తూ, సీఎం పర్యటించే ప్రాంతా లను సందర్శించి లోటుపాట్లపై చర్చిస్తూ పనుల పూర్తికి సూచనలందిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలకొండ సమీ పంలో భూత్పూర్‌ రోడ్డు పక్కన ఆధునిక హంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. హెలీప్యాడ్‌ సహా ఆడిటోరియం, 32 శాఖల కార్యాలయాలు ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం కోసం ఇక్కడ 22 ఎకరాల స్థలాన్ని గుర్తించగా, అందులో దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో సముదాయాన్ని నిర్మించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి న ఈ కాంప్లెక్స్‌ చుట్టూ ప్రహారీ నిర్మించారు. ప్రహారీ లోపల గార్డెన్స్‌, లాన్‌, ప్రత్యేక పార్కింగు సదుపాయాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 32 శాఖల కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు చేసేందుకు ఈ కాంప్లెక్స్‌తో సౌలభ్యం ఏర్పడింది. అద్భుతమైన లైటింగ్‌ సదుపాయాలు, ఆడియో సిస్టమ్స్‌ ఇక్కడ ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులు పూర్త వడంతో మెరుగులు దిద్దుతున్నారు. ఒకవైపు బైపాస్‌ రోడ్డు, మరోవైపు భూత్పూర్‌-రాయిచూరు రోడ్డుకు ఆనుకొని ఈ కాంప్లెక్స్‌ నిర్మితమవడంతో ఈ ప్రాంతానికి శోభవచ్చింది.

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఇప్పటికే మెడికల్‌ కాళాశాల అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, దానికి కొనసాగింపుగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.500 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయి కార్యాలయాలన్నీ అక్కడకు తరలుతుండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఈ మల్టీ స్పెషా లిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. 954 పడకల సామర్థ్యంతో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారవడంతో టెండర్‌ దక్కించుకున్న నిర్మాణ సంస్థ పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్మాణ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీకి అనుసంధానం చేయనుండడంతో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని భావి స్తున్నారు. ఒక్కో ఫ్లోర్‌లో ఆరు విభాగాల నిర్మాణాలు ఉండేలా డిజైన్‌ రూపొందిం చారని, నిర్మాణ పనులు మొద లయ్యాక సందర్భాను సారంగా మార్పులు చేర్పు లుంటాయని అధికారవర్గాలు పేర్కొం టున్నాయి. మొత్తం ఏడాదిన్నరలో ఈ నిర్మాణం పూర్తిచేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T00:10:56+05:30 IST