-
-
Home » Telangana » Mahbubnagar » Electricity workers should improve their efficiency-MRGS-Telangana
-
విద్యుత్ ఉద్యోగులు సమర్థత పెంచుకోవాలి
ABN , First Publish Date - 2022-10-05T05:03:07+05:30 IST
విద్యుత్ ఉద్యోగులు అంతర్గత సమర్థతను పెంచుకోవాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీనివాస్ సూచించారు.

- ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్
పాలమూరు, అక్టోబరు 4 : విద్యుత్ ఉద్యోగులు అంతర్గత సమర్థతను పెంచుకోవాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీనివాస్ సూచించారు. మంగళవారం విద్యుత్ భవన్లో మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల విద్యుత్ ఉద్యోగులతో అంతర్గత సమర్థత పెంచుకునే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందజేయటం, బిల్లులు వందశాతం వసూలు చేయటంపై దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రూరల్ జోన్ సీజీఎం పి.భిక్షపతి, ఎస్.ఈ ఎన్.శ్రీరామమూర్తి, ఎస్.ఈ లీలావతి, ఎస్ఏవో డీఈలు, ఏడీలు, ఏఈలు, ఏఏఓ, ఉద్యోగులు పాల్గొన్నారు.