TS News: వనపర్తిలో పేలిన ఎలక్ట్రిక్ బైక్

ABN , First Publish Date - 2022-09-28T19:59:01+05:30 IST

మహబూబ్‌నగర్: వనపర్తి (Vanaparti)లో మరో ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) పేలింది.

TS News: వనపర్తిలో పేలిన ఎలక్ట్రిక్ బైక్

మహబూబ్‌నగర్: వనపర్తి (Vanaparti)లో మరో ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) పేలింది (exploded). పార్కింగ్ చేసిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో రెండు బైకులు దగ్ధమయ్యాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఒక్కసారిగా బ్యాటరీ పేలడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Read more