-
-
Home » Telangana » Mahbubnagar » Efforts should be made for the development of the district-MRGS-Telangana
-
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-09-29T05:23:01+05:30 IST
వనప ర్తి జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చే యాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అ న్నారు.

- స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి
వనపర్తి రూరల్,సెప్టెంబరు28: వనప ర్తి జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చే యాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అ న్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో 1,6,7వ స్థాయీ సం ఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారు చేపట్టి న ప్రగతి నివేదికలను చదివి వినిపించా రు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన షాదీఖాణాల నిర్మాణం, మస్జిదులకు కంపౌండ్ నిర్మాణం, స్కాలర్ షిప్‌లు తదితర అంశాలను సంబంధిత అధికారి చదివి వినిపించారు. అలాగే గిరి జన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వసతి గృహాల ని ర్వహణ, స్కాలర్షిప్లు, స్కీమ్‌ల గు రించి వివరించారు. దళితబంధు పథకం ద్వారా జిల్లాలో మంజూరైన యూనిట్లు, నెలకొల్పిన వ్యాపార సముదాయాల వివరాలను సంబంధిత అధికారి చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మునీర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.