‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2022-10-19T04:20:09+05:30 IST

దళితబంధు పథకం ద్వారా దళిత కుటుం బాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు నని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు.

‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి
మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 


వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 18: దళితబంధు పథకం ద్వారా దళిత కుటుం బాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు నని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభి వృద్ధి సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో దళితబంధు, వ్యవసాయ అనుబంధ శాఖలతో ఫౌల్ర్టీ, డైరీ యూనిట్ల అధికా రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దళితబంధు అమలులో భాగంగా లబ్ధిదారులు కోరుకున్న విధంగా వారికి నైపుణ్యం కలిగిన రంగాల్లో లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. మొదటి విడత దళితబంధులో 119 యూనిట్లు మంజూరు అయ్యాయని, రెండవ విడతలో 500 యూనిట్లను మంజూరు చేయనున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ, మత్స్య పరిశ్రమ, డైరీ, పౌల్ర్టీ, మత్స్య, ఆక్వా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని స్ర్కీన్‌ ద్వారా లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లను, జిల్లా అధికారులను కలెక్టర్‌ అభినందించారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ డైరీ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందని తెలిపారు. అనంతరం దళితబంధు పథకం ద్వారా లబ్ది పొందుతున్న లబ్ధిదారుల యూనిట్ల వివరాలు, వారి విజయాలను వారు వివరించారు. కార్యక్రమంలో దళిత బంధు అడ్వయిజర్‌ లక్ష్మారెడ్డి, అద నపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(లోకల్‌ బాడీ), వేణుగోపాల్‌(రెవెన్యూ), సెక్టార్‌ అధికారులు, ఎస్సీ కార్పొ రేషన్‌ అధికారి మల్లికార్జున్‌(ఈడీ), డీఆర్‌డీవో నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి, డీసీవో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అదనపు డీఆర్‌డీవో రేణుక, జిల్లా మైనార్టీ అధికారిణి క్రాంతి, జిల్లా అధికారులు, శాస్త్ర వేత్తలు, దళితబంధు యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు. Read more