పాడి పరిశ్రమతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2022-12-13T23:03:43+05:30 IST

పాడి పరిశ్రమ లకు ఇచ్చే రుణాలను పొంది ఆర్థికంగా అభి వృ ద్ధి చెందాలని రైతులకు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

పాడి పరిశ్రమతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
లబ్ధిదారులకు చెక్కును అందిస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

- ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

- లబ్ధిదారులకు చెక్కులు అందజేత

బల్మూరు, డిసెంబరు 13 : పాడి పరిశ్రమ లకు ఇచ్చే రుణాలను పొంది ఆర్థికంగా అభి వృ ద్ధి చెందాలని రైతులకు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల ప రిధిలోని కొండనాగుల వ్యవసాయ సహకార పరపతి బ్యాంక్‌ ఆవరణలో కార్యనిర్వాహణ అధికారి రాజావర్ధన్‌రెడ్డి అధ్యక్షత సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ హాజరై మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సహకార సంఘం కొండనాగుల బ్యాంక్‌ పనితీరు భేషుగ్గా ఉందన్నారు. రైతులు బాగుంటేనే మనం బాగుంటామని వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న ని ర్ణయం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాయని, వాటిని రైతులు పాటిస్తూ ముందడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. రైతులను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. అచ్చంపేట ని యోజకవర్గంలోని బల్మూరు, అమ్రాబాద్‌, పదర మండలాలకు సాగునీరందించే విధంగా త్వర లోనే సీఏంచే శంకుస్థాపన చేయనున్నారని తెలి పారు. శ్రీఉమామహేశ్వర ప్రాజెక్టు కింద మైలా రం సమీపంలో 2.5 టీఎంసీల సాగునీరు తీసుకొచ్చి బల్మూరు మండలంలో రైతులకు 90వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలు కూ డా త్వరగానే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం పాడి రైతులకు మంజూరు అయిన రుణాల చెక్కును అందజేశారు. సమావేశంలో ఎంపీపీ వేనేపల్లి అరుణ నరసింహారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బండపల్లి వెంకటయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సయ్యయాదవ్‌, సహకార బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ లింబాద్రి, సర్పంచ్‌ రేవతి, ఉప సర్పంచ్‌ యూసుఫ్‌, ఎంపీటీసీలు పద్మావతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యా వ్యవస్థ పటిష్టం కోసం ప్రభుత్వం కృషి

అచ్చంపేటటౌన్‌ : విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని మహేంద్ర నగర్‌ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి మంజూరైన రూ. 19లక్షల నిధులకు సంబంధించిన పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:03:46+05:30 IST