గద్వాలలో దసరా పండుగ సందడి

ABN , First Publish Date - 2022-10-05T04:44:57+05:30 IST

దసరా వే డుకలు బుధవారం నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమ య్యారు.

గద్వాలలో దసరా పండుగ సందడి
గద్వాల ప్రధాన మార్కెట్‌ రోడ్డులో నెలకొన్న పండుగ సందడి

- బజార్లు కిటకిట  - పూలు, పత్రుల కొనుగోలుకు ఎగబడిన జనం

గద్వాల టౌన్‌, అక్టోబరు 4 : దసరా వే డుకలు బుధవారం  నిర్వహించుకునేందుకు  జిల్లా ప్రజలు సిద్ధమ య్యారు. ఇతర ప్రాం తాల్లో స్థిరపడ్డ వారం తా సొంతూళ్లకు రా వడంతో పల్లెల్లో సం దడి నెలకొంది. దస రా పండుగ సరుకుల కొనుగోలు కోసం వచ్చిన వారితో మంగళ వారం పట్టణంలోని ప్రధాన  మార్కెట్‌ రహ దారులు   కోలహలం గా మారాయి.  తొమ్మిది రోజలు పాటు సాగిన దేవీ నవరాత్రి ఉత్సవాల అనంతరం విజయదశమి నాడు దసరా పండుగగా అన్నివర్గాల ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆ నవాయితీ. ఈ సందర్భంగా ఆయుధపూజ, వాహనాల పూజలు నిర్వహించే సంప్రదాయం ఉండటంతో  పండుగ సరుకులు, కొత్తబట్టలు కొనుగోలు చేసే వారితో ఆయా దుకాణాలు కూరగాయల మార్కెట్లు, బట్టలషాపులు కిటకిట లాడాయి.  దీంతోపాటు  మామిడాకులు, పూలు, పండ్లు, పత్రి, గుమ్మడి కాయలను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. Read more