-
-
Home » Telangana » Mahbubnagar » Due to the incompetence of the rulers the villages are impassable-MRGS-Telangana
-
పాలకుల అసమర్థతతో గ్రామాలు దాటలేని పరిస్థితి
ABN , First Publish Date - 2022-10-05T04:24:27+05:30 IST
పాలకుల అసమర్థతతో వర్షం వస్తే ముక్కిడిగుండం - నార్లాపూర్ ప్రజలు గ్రామాలు దాట లేని పరిస్థితి నెలకొందని టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగ దీశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు
- ముక్కిడిగుండం, నార్లాపూర్ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్
కొల్లాపూర్, అక్టోబరు 4: పాలకుల అసమర్థతతో వర్షం వస్తే ముక్కిడిగుండం - నార్లాపూర్ ప్రజలు గ్రామాలు దాట లేని పరిస్థితి నెలకొందని టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగ దీశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి కొల్లాపూర్ మండలంలోని ముక్కి డిగుండం - నార్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం లేకపోవడం దుర దృష్టకరమన్నారు. వాగుపై వంతెన నిర్మించేలా చర్యలు చేప ట్టాలని కోరుతూ పెద్దవాగు వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకున మోని రాముయాదవ్, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు పరుశ రామ్‌నాయుడు, చంద్రశేఖర్‌యాదవ్, కోడేరు మండల వర్కిం గ్ ప్రెసిడెంట్ కిరణ్‌కుమార్, ముక్కిడిగుండం గ్రామ పార్టీ అధ్యక్షుడు బెట్టారి నాగయ్య, నార్లాపూర్ గ్రామ పార్టీ అధ్య క్షుడు రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంత కుముందు పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన టీ ఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు 50మంది జగ దీశ్వర్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.