నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు పంపిణీ

ABN , First Publish Date - 2022-07-19T04:54:06+05:30 IST

గొర్రెల్లో నీలి నాలుక నివారణకు జిల్లాలో నాలుగు లక్షల టీకాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి సురేఖ పేర్కొన్నారు.

నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు పంపిణీ
వీరారంలో గొర్రెకు టీకా వేస్తున్న జిల్లా పశువైద్యాధికారిణి సురేఖ

- ఉచితంగా నాలుగు లక్షల టీకాలు

-  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి సురేఖ

మద్దూర్‌, జూలై 18 : గొర్రెల్లో నీలి నాలుక నివారణకు జిల్లాలో నాలుగు లక్షల టీకాలను ఉచితంగా   ఇవ్వనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి సురేఖ పేర్కొన్నారు. మండంలంలో వీరారం గ్రామంలో కొనసాగుతున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం తనిఖీ చేసి టీకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీలి నాలుక టీకాలు స్థానిక పశువైద్య కేంద్రంలో అందుబా టులో ఉన్నాయన్నారు. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు గొర్రెలకు టీకాలు వేయిం చకుండా సాధారణ పరిస్థితుల్లో మాత్రమే టీకాలు వేయాలని సిబ్బందికి సూచిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తిరుపతి, పశువైద్యాధికారులు రాఘవేందర్‌గౌడ్‌, విశాల పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌/దామరగిద్ద : మండలంలోని కోటకొండలో పశువై ద్యాధికారి అనిరుద్దాచార్య ఆధ్వర్యంలో 825 గొర్రెలకు నీటి నాలుక నివారణ టీకా లు పంపిణీ చేశారు. 19న బొమ్మన్‌పాడ్‌, బండగొండ, అభంగాపూర్‌లో కొనసాగు తుందని కాపరులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలన్నారు. డా.శ్రీనివాస్‌, రాధిక, శంకరమ్మ, శ్రవంతి, రేవతి, ప్రతాప్‌, మహేష్‌ పాల్గొన్నారు. అదే విధంగా దామరగిద్ద మండలం కాన్‌కుర్తిలో పశువైద్యాధికారి సబిత ఆధ్వర్యంలో 725 గొర్రెలకు టీకాలు పంపిణీ చేశారు. బాలకిష్టప్ప, గోపాల మిత్రలు గుండప్ప, హరికృష్ణ, దేవేందర్‌ పాల్గొన్నారు.

Read more