వివాహిత అదృశ్యం, కేసు నమోదు

ABN , First Publish Date - 2022-11-11T23:03:38+05:30 IST

ఇంటి నుంచి పొలానికి వెళ్లిన భార్య అదృశ్య మైందని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డి తెలిపారు.

వివాహిత అదృశ్యం, కేసు నమోదు

బిజినేపల్లి, నవంబరు 11: ఇంటి నుంచి పొలానికి వెళ్లిన భార్య అదృశ్య మైందని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగ నూర్‌ గ్రామానికి చెందిన చింతకాయల లక్ష్మమ్మ ఈనెల 5న ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని అత్త రంగమ్మకు చెప్పి వెళ్లింది. రాత్రి కావస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో పొలం, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. గ్రామాలు, బంధువుల ఇళ్లల్లోనూ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భర్త చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు

Updated Date - 2022-11-11T23:03:38+05:30 IST

Read more