డీఈ ఆఫీసు ముందు విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-07-06T05:18:31+05:30 IST

విద్యుత్‌శాఖ డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) నవీన్‌కుమార్‌ ఉద్యో గుల బదిలీల్లో తమకు అన్యాయం చేశారని ఆ శాఖలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంక్షే మ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

డీఈ ఆఫీసు ముందు విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

పాలమూరు, జూలై 5 : విద్యుత్‌శాఖ డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) నవీన్‌కుమార్‌ ఉద్యో గుల బదిలీల్లో తమకు అన్యాయం చేశారని ఆ శాఖలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంక్షే మ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రెండోరోజు డీఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డీఈ బి.నవీన్‌కుమార్‌ ఒక ట్రేడ్‌ యూని యన్‌కు అనుకూలంగా, ఏకపక్షంగా ఆర్డర్లు ఇవ్వడం దుర్మార్గమని నారాయణ నాయక్‌, జి.లింగంగౌడ్‌, ఎస్‌.పాండు నాయక్‌లు అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ సంక్షేమ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. డీఈపైన శాఖాపరమైన చ ర్యలు తీసుకోవాలని నాయకులు పై అధికారులను కోరారు. డీఈ ఇచ్చిన ఆర్డర్లను నిలుప దలచేయకపోతే స్పాట్‌ బిల్లింగ్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాధర్‌, సత్యం నాయక్‌, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 


‘నెంబర్‌ ప్లేట్‌ లేని ఆటోలపై చర్యలు’

మహబూబ్‌నగర్‌, జూలై 5 : నెంబర్‌ప్లేట్లు లేకుండా ఇష్ఠానుసారంగా తిరుగుతున్న ఆటోలపై మంగళవారం ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పట్టణంలోని సుభాష్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు చేసిన తనిఖీలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగు తున్న పదుల సంఖ్యలో ఆటోలను పట్టుకుని వాటిని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆటో యజమానులు ట్రాఫిక్‌ నిబంధనలు, మోటార్‌ వాహన చట్టాలను  అనుసరించాలని చెప్పారు. ప్రతీ వాహనానికి విధిగా నెంబర్‌ప్లేట్‌ ఉండాలని, ఇకపై ఏ వాహనానికి నెంబర్‌ప్లేట్‌ లేకున్నా సీజ్‌ చేయడంతోపాటు పెద్దఎత్తున జరిమానా విధిస్తామన్నారు. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు. 


ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండాలి 

  - జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్‌ 

జడ్చర్ల, జూలై 5 : వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లు రైతులకు అందుబాటు లో ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్‌ సూచించారు. జడ్చర్లలోని రైతు వేదిక వద్ద మంగళవారం జడ్చర్ల, దేవరకద్ర డివిజన్‌లలోని ఏఈఓలకు నూతనంగా తీసుకు వచ్చిన మొబైల్‌యాప్‌ గురించి వివరించారు. రైతులకు అందిస్తున్న సేవలను మొబైల్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. రైతువేదికల వద్ద నిర్వహించే సమావేశాలు, రైతుబంధు, రైతు బీమా క్లెయిమ్స్‌, భూసార పరీక్షల కోసం సేకరించిన మట్టి నమూనాలు, క్షేత్రస్థాయిలో రైతులను కలిసిన అంశాలు తదితర వాటిని మొత్తం ఎప్పటికప్పుడు మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు యశ్వంత్‌రావు, హైమావతి, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. 


రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం అభినందనీయం - ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, జూలై 5 : ప్రజలు రాజీమార్గం ద్వారా  కేసులను పరిష్కరించుకోవడం అభినందనీయమని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. గతనెలలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో పోలీసుల పిలుపుమేరకు జిల్లాలో 4893 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కారం కావడం గొప్పవిషయమని, ఇందుకోసం కృషి చే సిన పోలీసులను ఆయన అభినందించారు. ప్రజల సమస్య లు పరిష్కరించేందుకు పోలీసులు ఎల్లప్పుడు ముందుం టా రని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలనైనా పోలీసుల దృష్ఠికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


Read more