ధరణి సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-20T04:36:18+05:30 IST

ధరణి తో రైతులకు ఎదురవుతున్న సమస్యల ను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ అలంపూర్‌ సమన్వయకర్త లక్ష్మీనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు.

ధరణి సమస్యలు పరిష్కరించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాౄయకులు

- కాంగ్రెస్‌ అలంపూర్‌ సమన్వయకర్త లక్ష్మీనారాయణ

ఎర్రవల్లి చౌరస్తా, సెప్టెంబరు 19 : ధరణి తో రైతులకు ఎదురవుతున్న సమస్యల ను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ అలంపూర్‌ సమన్వయకర్త లక్ష్మీనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మండ లంలోని ఎర్రవల్లి చౌరస్తాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. రైతుల హక్కులను హరిస్తున్న ధరణి పోర్టల్‌ను నిరసిస్తూ ఈ నెల 23న కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు మరింత పెరిగాయని, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా, అధికారులకు అవగాహన లేక రిజెక్టు చేస్తున్నారని తెలి పారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


    అయిజ : ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్‌ నాయ కులు అయిజ తహసీల్దార్‌ లక్ష్మికి వినతిపత్రం అందించారు. ఈ నెల 22వ తేదీలోపు సమస్యను పరిష్కరించకుంటే 23న కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి ఆచారి, మండల అధ్యక్షుడు జయన్న, కౌన్సిలర్‌ దేవరాజు, హనుమన్న, మద్దిలేటి, పులికల్‌ బార్కి దేవన్న, బసవరాజు, సాంబశివుడు, ఫిరోజ్‌, దేవేంద్ర, పాండురంగ, రాముడు, రమేష్‌, లక్ష్మన్న, నరేష్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

Read more