ధరణి పోర్టల్‌ను సరిచేయాలి

ABN , First Publish Date - 2022-11-30T23:31:20+05:30 IST

ధరణి పోర్టల్‌ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, లోప భూయిష్టంగా ఉన్న ఆ పోర్టల్‌ను సరి చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

ధరణి పోర్టల్‌ను సరిచేయాలి
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌

-అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా

మహబూబ్‌నగర్‌, నవంబరు 30 : ధరణి పోర్టల్‌ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, లోప భూయిష్టంగా ఉన్న ఆ పోర్టల్‌ను సరి చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. పెద్ద రైతులకు అనుకూలంగా ఉందని, చిన్నరైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీజే బెనహర్‌, జహీర్‌అక్తర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, నయీమోద్దీన్‌, సాయిబాబ, అవేజ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లు నర్సింహారెడ్డి, వెంకటయ్య, వెంకటలక్ష్మి, సుభాష్‌ఖత్రి, అబ్దుల్‌ హక్‌, శారద, సహజ, తాహెర్‌ పాల్గొన్నారు.

ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌కు లాభం

దేవరకద్ర :ధరణి పోర్టల్‌ ద్వారా సీఎం కేసీఆర్‌కు లాభం చేకూరిందే తప్ప రైతులకు న్యాయం జరగడం లేదని టీపీసీసీ కార్యదర్శి జీ మాదుసూదన్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొండ ప్రశాంత్‌రెడ్డి, సమన్వయకర్త మధుసూదన్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. చనిపోయిన రైతుల భూములను స్లాట్‌ చేసుకుంటే చాలు రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారని, చని పోయిన వ్యక్తికి ఎంత మంది వారసులు ఉన్నారు అన్న వివరణ లేకుండా రిజిస్ర్టేషన్‌ చేయడంతో కొంత మంది వా రసులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ధరణి వ్యవ స్థను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్‌, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్‌ టీసీ శ్రీనివాసులు, నాయకులు రంజిత్‌గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, వీరారెడ్డి, నరసింహారెడ్డి, వాయద్‌అలీ, రాజు, ఆంజనేయు లు, నాయకులు పాల్గొన్నారు.

అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం : మాజీ ఎమ్మెల్యే

జడ్చర్ల : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ అన్నారు. జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో రైతుదీక్ష కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా పథకాలను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, రైతుకు గత ప్రభుత్వాలు అందించే డ్రిప్‌, సబ్సిడీపై పనిముట్లు తదితర వాటిని ఎత్తేసిందని ఆరోపించారు. రైతుల కు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, నేటికీ అమలు చేయని రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. పోడుభూములకు పట్టా సర్టిఫికె ట్‌లు ఇస్తామంటూ పోడురైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే అధికారపార్టీ నాయకుల చేష్టలతో ఇబ్బందులకు గురవుతున్న జడ్చర్ల ప్రజ ల పక్షాన నిలబడతామని వెల్లడిం చారు. అనంతరం పార్టీ రాష్ట్ర పరిశీలకులు సురేందర్‌తో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుర్ల వెంకటయ్య, మినాజ్‌, బుక్క వెంకటేశ్‌, అశోక్‌ యాదవ్‌, కరాటే శ్రీను, అలీమొద్దీన్‌, ఖయ్యూం, లక్ష్మమ్మ, శేఖర్‌, నక్కా రాఘవేందర్‌, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:31:20+05:30 IST

Read more