టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST

గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో చేసుకున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
దేవరకద్ర మండలంలో చీరలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ

- బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే ఆల, ఎంపీ మన్నె

దేవరకద్ర, అక్టోబరు 2 : గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో చేసుకున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని చిన్నరాజమూర్‌, డోకూర్‌, గూరకొండ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకో వాలనే ఉద్దేశంతో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాశ్రీకాంత్‌,  మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, కొండ శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్‌లు కొండారెడ్డి, నరేందర్‌రెడ్డి, శివానంద్‌, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మహాత్ముని సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, అక్టోబరు 2 : మహాత్మాగాంధీ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా భూత్పూర్‌ చౌరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. మండల పరిషత్‌ కార్యాల యం వద్ద ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, అమిస్తాపూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముసా బాలస్వామి, పోతులమడుగులో జిల్లా మత్స్య సహకార సంఽఘం అధ్యక్షుడు సత్యనారాయణ గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాయిలు, సింగిల్‌ విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేష్‌కుమార్‌గౌడ్‌, మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, నాయకులు మురళీధర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌, మేకల సత్యనారాయణ, అశోక్‌గౌడ్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు రమేష్‌, శ్రీరాములు, మునిసి పల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు అజీజ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బాలస్వామి, సురేష్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Read more