గాయత్రీదేవిగా దుర్గామాత దర్శనం

ABN , First Publish Date - 2022-09-29T05:21:35+05:30 IST

మండలంలోని దే వీ ఆలయాలలో శరన్నవరాత్రుల ఉత్సవాలు మూడవ రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో కొన సాగాయి.

గాయత్రీదేవిగా దుర్గామాత దర్శనం
అమరచింతలోని విఘ్నేశ్వర భవానినగర్‌లో గాయత్రి దేవికి పూజలు నిర్వహిస్తున్న భక్తులు

- వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

- వివిధ అలంకరణల్లో అమ్మవార్ల దర్శనం

- ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

కొత్తకోట, సెప్టెంబరు 28: మండలంలోని దే వీ ఆలయాలలో శరన్నవరాత్రుల ఉత్సవాలు మూడవ రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో కొన సాగాయి. పట్టణంలోని అంబాభవాని ఆలయం లోని భవాని మాత గాయత్రీ దేవిగా, భక్త మా ర్కండేయ దేవాలయంలోని పార్వతీమాత గాయత్రీ దేవీగా, కన్యకా పరమేశ్వరి ఆలయం లోని వాసవీ మాత లలితా త్రిపురసుందరి దేవీ గా, కోటిలింగేశ్వరస్వామి ఆలయంలోని జ్ఞానాం బికాదేవీ లలితాదేవీగా భక్తులకు దర్శనం ఇచ్చా రు. అమ్మవార్లను భక్తులు  దర్శించుకొని ప్రత్యే క పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తుల కు అయా ఆలయాల నిర్వాహకులు అన్నదానం చేశారు.కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆత్మకూరులో..

ఆత్మకూర్‌: ఆత్మకూర్‌ మండలంలోని ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన అమ్మవార్లకు భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన అ మ్మవారి గాయత్రీదేవిగా దర్శనమించారు. ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యులు గడ్డమీద శ్రీ నివాస్‌, గాయత్రి ప్రత్యేకపూజలు చేశారు. కా ర్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. 

అమరచింతలో..

అమరచింత: అమరచింత మునిసిపాలిటీలో ని కాళికాదేవి ఆలయం, శివ చౌడేశ్వరి ఆలయం లో దుర్గామాతకు ప్రత్యేక పూజలను నిర్వహిం చారు. అలాగే పట్టణంలోని జగన్‌వాడ, గణేష్‌న గర్‌, సంతోష్‌ నగర్‌, విఘ్నేశ్వర భవానినగర్‌లో గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.  గోరింట్ల నవీన్‌ కుమార్‌ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. 


Read more