ప్రమాద ప్రయాణం

ABN , First Publish Date - 2022-08-16T05:52:40+05:30 IST

జోగు ళాంబ గద్వాల జిల్లా దివి గ్రామ ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారు. నదిపై వెళ్లే పవర్‌ బోటులో 15 మంది వరకే ఎక్కించుకోవాల్సి ఉండగా, నిర్వాహకులు 50 మందిని ఎక్కించుకుంటున్నారు.

ప్రమాద ప్రయాణం
పవర్‌ బోటులో కిక్కిరిసి కూర్చున్న ప్రయాణికులు

పవర్‌ బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు

కెపాసిటీ 15 మంది.. ఎక్కుతున్నది 50 మంది..


గద్వాల, ఆగస్టు 15: జోగు ళాంబ గద్వాల జిల్లా దివి గ్రామ ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారు. నదిపై వెళ్లే పవర్‌ బోటులో 15 మంది వరకే ఎక్కించుకోవాల్సి ఉండగా, నిర్వాహకులు 50 మందిని ఎక్కించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. దాంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు గుర్రంగడ్డకు వెళ్తున్నారు. నదికి కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో నదిలో వరద ఎక్కువగా ఉంది. బీరోలు నుంచి గుర్రంగడ్డకు వెళ్లే ప్రదేశాలలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. జాగ్రత్తలపై అప్రమత్తం చేయాల్సిన రెవెన్యూ, పోలీస్‌ శాఖ పట్టించుకోవడం లేదు.

Read more