పంట పొలాలకు సాగునీరు అందించాలి

ABN , First Publish Date - 2022-09-29T05:25:45+05:30 IST

వీపనగం డ్ల ఉమ్మడి మండ లంలోని గ్రామాల పొలాలకు సాగు నీరు అందడం లే దని రైతులు ఆవే దన వ్యక్తం చేశా రు.

పంట పొలాలకు సాగునీరు అందించాలి
అధికారులతో మాట్లాడుతున్న నాయకులు, రైతులు

పెబ్బేరు, సెప్టెం బరు 28: వీపనగం డ్ల ఉమ్మడి మండ లంలోని గ్రామాల పొలాలకు సాగు నీరు అందడం లే దని రైతులు ఆవే దన వ్యక్తం చేశా రు. బుధవారం పె బ్బేరు మండల కేం ద్రంలోని జూరా ల ఎస్సీ కార్యాలయం వద్ద రైతులు ఆం దోళన చేశారు. రైతులకు టీపీసీసీ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు, పెబ్బేరు మండల నాయకులు విజయవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. డి-38 కాలువ ద్వారా వెంటనే రైతులకు నీరు అందించాలని జగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి  వీపనగండ్ల మండలం రైతులు, కాంగ్రెస్‌ నాయకులు   పాల్గొన్నారు.

Read more