నేర నియంత్రణకు ప్రాథమిక దశలోనే చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-14T05:00:53+05:30 IST

నేరాలను పూర్తి స్థాయిలో నిర్మూలించా లంటే ప్రాథమిక దశలోనే కఠినచర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు.

నేర నియంత్రణకు ప్రాథమిక దశలోనే చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

- ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 13 : నేరాలను పూర్తి స్థాయిలో నిర్మూలించా లంటే ప్రాథమిక దశలోనే కఠినచర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా బాధితులకు సహాయం చేస్తూ, పోలీస్‌ ఇమేజ్‌ కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరు గట్టిగా పని చేయాలని సూచించారు. మంగళ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతిభద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటి నీ పరిష్కరించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా కలిగే లాభా లను ప్రజలకు వివరించాలని, గ్రామస్థాయిలోనూ కెమెరాల ఏర్పాటుకు కృషి చే యాలని తెలిపారు. ఆకస్మిక వాహనాల తనిఖీలు, కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహించా లని అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర చర్యగా భా వించాలని, ఆయా పోలీస్‌ స్టేషన్‌ల వారీగా సమస్యాత్మక గ్రామాలను, వ్యక్తుల ను గుర్తించడంలో గ్రామ పోలీస్‌ అధికారులను పురమాయించాలని తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణకై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్‌, రమణారెడ్డి, లక్ష్మణ్‌, మధు, ఆదినారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T05:00:53+05:30 IST