ఉమ్మడి జిల్లాలో 31 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-02-20T04:43:00+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 7,578 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 31 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,171 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు.

ఉమ్మడి జిల్లాలో 31 మందికి కరోనా

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఎక్కువ కేసులు


గద్వాల క్రైం, ఫిబ్రవరి 19 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 7,578 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 31 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,171 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 19 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,572 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముగ్గురు వైరస్‌ బారిన పడ్డట్లు తేలింది. నాగర్‌కర్నూలు జిల్లాలో 2,241 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలో 1,929 టెస్టులు చేశారు. నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. నారాయణపేట జిల్లాలో 665 టెస్టులు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

Read more