కొనసాగిన తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-29T05:24:19+05:30 IST

మూడు రోజులుగా వనపర్తి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌, డెంటల్‌, ల్యా బ్‌, ఫిజియోథెరఫీ కేంద్రాలపై వైద్య ఆరో గ్యశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కొనసాగిన తనిఖీలు
జిల్లా కేంద్రంలోని పాలీ క్లినిక్‌ను సీజ్‌ చేస్తున్న వైద్యశాఖ అధికారులు

- జిల్లా కేంద్రంలోని ఓ పాలీ క్లినిక్‌ సీజ్‌,  పలు కేంద్రాలకు నోటీసులు, జరిమానా   

వనపర్తి వైద్యవిభాగం, సెప్టెంబరు 28: మూడు రోజులుగా వనపర్తి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌, డెంటల్‌, ల్యా బ్‌, ఫిజియోథెరఫీ కేంద్రాలపై వైద్య ఆరో గ్యశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కేం ద్రంతో పాటు కొత్తకోటలోని ఒక ఆస్పత్రి, ఐదు క్లినిక్‌లు, 11 ల్యాబ్‌లను తనిఖీ చేసి నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌ తెలిపారు. కొత్తకోటలోని నాలుగు కేంద్రాలకు నోటీసులు ఇచ్చామని, వనపర్తిలోని నాలుగు కేంద్రాలకు బయో పొల్యూషన్‌ లేనందున వాటికి కూడా నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని వీకేర్‌ ఆస్పత్రికి ఫైర్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకపోవడంతో నోటీసులు ఇచ్చామ ని, మరో క్లినిక్‌లో రిజిస్ట్రేషన్‌ సమయం ముగిసినా అలాగే కొనసాగుతుండటంతో రూ. 1800 జరినామా వేశామన్నా రు. వీటితో పాటు జిల్లా కేంద్రంలోని రక్షా పాలీ క్లినిక్‌ ఆరు నెలలుగా నడుపుతున్నారని, గతంతో రెండు సార్లు నోటీసు లు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. ప్ర తీ ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, అనుమ తులు తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డెంటల్‌ క్లినిక్‌లు, ఫిజియోథెరఫీ వంటి వైద్య కేంద్రాలను కొనసాగించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్ర మంలో వనపర్తి తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ప్రోగ్రాం అధి కారి డాక్టర్‌ ఇస్మాయిల్‌, మాస్‌ మీడియా అధికారి చంద్రయ్య, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Read more