లెదర్‌పార్కు చుట్టూ కంచె ఏర్పాటు

ABN , First Publish Date - 2022-07-06T04:50:54+05:30 IST

మండల పరిధిలోని జిన్‌కుంట శివారులో మినీ లెదర్‌పార్కు చుట్టూ మంగళవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు బం దోబస్తు మధ్య కంచెను ఏర్పాటు చేశారు.

లెదర్‌పార్కు చుట్టూ కంచె ఏర్పాటు
లెదర్‌ పార్కు భూములకు కంచె ఏర్పాటు చేయిస్తున్న అధికారులు

 - అడ్డుకున్న రైతులు 

- అదుపులోకి తీసుకున్న పోలీసులు

బల్మూరు, జూలై 5 : మండల పరిధిలోని జిన్‌కుంట శివారులో మినీ లెదర్‌పార్కు చుట్టూ మంగళవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు బం దోబస్తు మధ్య  కంచెను ఏర్పాటు చేశారు. అయితే , విషయం తెలుసు కున్న రైతులు ఆందోళనకు దిగడంతో అదుపులోకి తీసుకొని ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆర్డీవో పాండునాయక్‌ విలేకర్లతో మాట్లాడుతూ  మండల పరిధిలోని జిన్‌కుంట శివారులో 25ఏళ్ల క్రితం మినీ లెదర్‌పార్కు కోసం  రైతుల నుంచి  25ఎకరాల భూములను సేకరిం చి అప్పటి రేటు కట్టించామన్నారు. అయితే ఇటీవల కొందరు రైతులు తమ భూమి ఇందులోనే ఉందని, అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తు న్నారని అన్నారు. దాంతో ఇటీవల జీఎం పర్యటించి కంచె ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించారన్నారు. దాంతో సర్వే చేయించి కంచె ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో బల్మూరు తహసీల్దార్‌ క్రిస్టియనాయక్‌, అచ్చంపేట, అమ్రాబాద్‌ సీఐలు అనుదీప్‌,  ఆదిరెడ్డి,  ఎస్‌ఐలు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read more