దళితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ

ABN , First Publish Date - 2022-07-08T04:40:15+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంత వరకు దళితులకు అం డగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఏఐసీసీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అ న్నారు.

దళితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ
గౌరయ్యకుంట తండా రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- మాజీ మంత్రి, పార్టీ  రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి


పెద్దమందడి, జూలై 7: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంత వరకు దళితులకు అం డగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఏఐసీసీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అ న్నారు. గురువారం మండల పరిధిలోని గౌరయ్య కుంటతండాలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను ప్ర తీ ఒక్కరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల కోసం చేపట్టనున్న సంక్షేమ పథ కాలను వివరించారు. రైతుకు రాజు చేయడమే పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార ప్రభుత్వంపై రైతుల కోసం, నిరు ద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం ప్రజా వ్య తిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని.. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఎన్‌ఎస్‌యూఐ నేషనల్‌ కోఆ ర్డినేటర్‌ నందిమల్ల త్రినాథ్‌ కోరారు. కార్యక్రమం లో శ్రీరంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్ర సాద్‌యాదవ్‌, ఎంపీపీ శంకర్‌నాయక్‌. మాజీ వైస్‌ ఎంపీపీ సురేష్‌గౌడ్‌, మాజీ సర్పంచులు మన్యం, శ్రీనివాసులు, నాయకులు పెంటన్న, వహీద్‌, అమ్మపల్లి తిరుపతయ్య, బిక్యనాయక్‌, చీర్ల రాజు, రోహిత్‌ తదితరులున్నారు.

 కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలి

పాన్‌గల్‌ : కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచే యాలని పార్టీ నియోజకవర్గ నాయకుడు చింతల పల్లి జగదీశ్వర్‌రావు అన్నారు. గురువారం మండ లంలోని దవాజిపల్లి, దొండాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, కార్యదర్శి కృష్ణ, సీనియర్‌ నాయకులు ఆది చం ద్రయ్య, మంగదొడ్డి సుధాకర్‌యాదవ్‌, స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బిచ్చారెడ్డి, కృష్ణయ్య, జానకిరామ్‌, కృష్ణయ్యగౌడ్‌, గట్టుయాదవ్‌, రోహిత్‌ సాగర్‌, నాగన్న, రామకృష్ణ తదితరులు పాల్గొ న్నారు.

 అధికారంలోకి రావడం ఖాయం

వనపర్తి టౌన్‌ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు రాధాకృష్ణ, సీనియర్‌ నాయకుడు కోట్లరవి, సురేష్‌, ఎండీ.బాబా, డి.వెంకటేష్‌, నాగరాజు, కదిరె రాములు, పెండెం మన్నెం యాదవ్‌, బాలరాజు, అబ్దుల్లా, దిలీప్‌, గంధం లక్ష్మయ్య, విజయ్‌బాబు తదితరులున్నారు. 

Read more