కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-03-04T06:12:53+05:30 IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన ఆభివృద్ధిని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిందేమీ లేదు


- బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు

- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి


మిడ్జిల్‌, మార్చి 3 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన ఆభివృద్ధిని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆభివృద్ధి పరుస్తున్నారని, అది చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. స్థలం ఉన్నవారికి ఇళ్లను నిర్మించుకునేందుకు వచ్చే నెల నుంచి రూ. 5లక్షలను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్‌కు దరఖాస్తులు చేసుకున్నవారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.


ప్రతీ యేటా రూ. 25వేలు పెంచుత


మండలంలోని వేముల గ్రామంలోని శ్రీ శివాంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూజ చేసి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఎద్దుల బండలాగుడు పోటీలలో గెలుపొందిన ఎద్దులకు మొదటి బహుమతిగా రూ. 50వేలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వంతంగా అందజేస్తారు. ఈ యేడు నుంచి ప్రతి యేట రూ. 25వేలను పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య, బాదేపల్లి మార్కెట్‌ చైర్మన్‌ శ్యాంసుదర్‌రెడ్డి, జడ్పీటీసీ శశిరేఖబాలు, ఎంపీపీ కాంతమ్మబాలస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు జంగారెడ్డి, రాధికవెంకట్‌రెడ్డి, సుదర్శన్‌, ఎల్లయ్యయాదవ్‌, బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నారాయణ్‌రెడ్డి, బంగారు, విజయ్‌, ఎంపీడీవో సాయిలక్ష్మీ, తహసీల్దార్‌ శ్రీనివాసులు, వేముల సర్పంచ్‌ జంగయ్య, ఎంపీటీసీ యశోదపాండు, శివాంజనేయస్వామి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, చైర్మన్‌ మైసయ్య, వైస్‌ చైర్మన్‌ కృష్ణయ్యగౌడ్‌, ఉప సర్పంచ్‌ మమతజగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు.


ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం


బాదేపల్లి : పట్టణంలోని పాతబజార్‌ హనుమాన్‌ దేవాలయంలో గురువా రం టీఆర్‌ఎస్‌ నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవిని లక్ష్మారెడ్డి త్యాగం చేసి 15 సంవత్సరాలు అవుతోందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్‌, రమేష్‌, నాయకులు మురళి, నర్సింహులు, శంకర్‌, సత్యం, నరేష్‌, శివ, ప్రవీణ్‌, వీడియో శ్రీను, జంగయ్య పాల్గొన్నారు.

Read more