భూత్పూర్‌ పాలకవర్గానికి అభినందనలు

ABN , First Publish Date - 2022-10-05T04:56:54+05:30 IST

భూత్పూర్‌ మునిసిపాలిటీకి స్వఛ్చ సర్వేక్షణ్‌ పథకంలో భాగంగా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది.

భూత్పూర్‌ పాలకవర్గానికి అభినందనలు
భూత్పూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, ఇతర అధికారులను అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌

- మంత్రి కేటీఆర్‌ను కలిసిన మునిసిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌

భూత్పూర్‌, అక్టోబరు 4 : భూత్పూర్‌ మునిసిపాలిటీకి స్వఛ్చ సర్వేక్షణ్‌  పథకంలో భాగంగా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవ ర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌, తదితరులు హైద రాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ను ప్రత్యేకంగా అభినంఽధించారు. మునిసిపాలిటీ అభివృద్ధికి పురపాలక శాఖ నుంచి రూ.2 కోట్ల నిధులను మంత్రి మంజూరు శారు. ఈ సందర్భంగా మంత్రికి మునిసిపల్‌ చైర్మన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపాలిటీని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Read more