గందరగోళం

ABN , First Publish Date - 2022-09-20T04:39:08+05:30 IST

పట్టణ శివారులో వైకుంఠధామం కోసం అధికారులు గుర్తించిన స్థలం లో గందరగోళం నెలకొంది.

గందరగోళం
వైకుంఠధామానికి స్థలం చూపించాలని తీర్మానం చేసిన దళిత సంఘం నాయకులు

వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 18: పట్టణ శివారులో వైకుంఠధామం కోసం అధికారులు గుర్తించిన స్థలం లో గందరగోళం నెలకొంది. సమాధులు చేసుకోవడా నికి స్థలం చూపించాలని దళితులు, మరోపక్క వ్యవ సాయ పొలాల మధ్య  వద్దంటు రైతులు వ్యతిరేకి స్తున్నారు. దీంతో వైకుంఠధామం కోసం అధికారులు గుర్తించిన స్థలం పరిసరాలలో ఉండే చెట్లకు రంగులు వేయడం, రాత్రికి రాత్రే దేవత ఉన్నట్లు అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. 

అసలేం జరిగింది...

మొదట దళితులు సమాధి చేసుకోవడానికి పట్ట ణ శివారుల్లో ఎక్కడైనా కొంత స్థలం కేటాయించాల ని దళిత సంఘాల నాయకులు అధికారులను కోరా రు.  ఎమ్మార్వో విచారణ చేసి పట్టణంలోని ఈదుల  చెరువు కింద సర్వే నెంబరు 726లోని ప్రభుత్వ భూ మి  1-20 గుంటల  స్థలం అనువుగా ఉందని ముని సిపల్‌ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దీంతో మునిసిపల్‌ కమిషనర్‌ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలానికి కంచె ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్న సమయంలో అక్కడి రైతులు వ్యతిరేకించా రు. చుట ్టపక్కల ఉండే చెట్లకు రంగులు వేశారు. రాత్రికి రాత్రే వ్యవసాయ దేవత (భూలక్ష్మి) గుడి ప్రత్యక్ష మైంది. దేవత ఉండే పరిసరాల్లో వైకుంఠధామానికి స్థలం ఇవ్వకూడదని రైతులు వ్యతిరేకించారు.   

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు.. 

అధికారులు సమాధుల కోసం స్థలం గుర్తించి నప్పటికీ చుట్టు పక్కల రైతులు వ్యతిరేకించడంతో దళిత సంఘాల నాయకులు తమకు న్యాయం చే యాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశా రు. దీంతో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సెక్రటరీ జీఎస్‌ పండదాస్‌ జిల్లా అధికారుల నుంచి వివరణ కోరుతు నోటీసు కూడా వచ్చింది.  గడువులోగా విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఎస్సీ,ఎస్టీ కమిషనర్‌ కోరారు. 

భూములు లేని వారు మరణిస్తే ఖననం చేసేందుకు ఎక్కడ కూడా స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Read more